నార్వే, స్వీడన్ వెళ్లనున్న'శివమ్'

  • IndiaGlitz, [Sunday,August 02 2015]

జీవా, కార్తీక, పియా బాజ్ పాయ్ నటించిన 'రంగం' చిత్రం గుర్తుందా? ఆ చిత్రం మొత్తం కలర్ ఫుల్ గా ఉంటుంది. ముఖ్యంగా నార్వే, స్వీడన్ లో తీసిన పాటలు చాలా కనువిందుగా ఉంటాయి.. ఆ అరుదైన లొకేషన్స్ లో రామ్ 'శివమ్' పాటల చిత్రీకరణ జరగనుంది.

ఈ సినిమాలో పాటలకు మంచి స్కోప్ ఉన్నందున, వాటి చిత్రీకరణ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు నిర్మాత స్రవంతి రవికిశోర్. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ నెల 4న ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. దీంతో పాటలు మినహా టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. పాటల చిత్రీకరణను ఈ నెల 18న ఆరంభించనున్నారు.

ఈ సందర్భంగా ....

స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ - ''18 నుంచి ఈ నెలాఖరు వరకూ పాటలను చిత్రీకరిస్తాం. నార్వే, స్వీడన్ లలో 'రంగం' షూటింగ్ జరిగిన ప్రాంతాల్లో ఈ పాటలను షూట్ చేస్తాం. లొకేషన్స్ చాలా హైలైట్ గా నిలుస్తాయి. ఈ షెడ్యూల్ లో మూడు పాటలు చిత్రీకరిస్తాం. ఇది హై ఓల్టేజ్ లవ్ స్టోరి. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు'' అని చెప్పారు.

బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, యాక్షన్: పీటర్ హెయిన్స్.

More News

ఆయన సలహాతో మహేష్ అలా చేశాడట...

‘శ్రీమంతుడు’గా ఆగస్ట్ 7న ప్రేక్షకులను పలకరించడానికి మహేష్ రెడీ అయిపోయాడు. ఈ సినిమాలో హీరో గ్రామాన్ని దత్తత్త తీసుకోవడమే మెయిన్ కాన్సెప్ట్.

చైతు కొత్త సినిమా టైటిల్...?

‘ఏ మాయ చేసావే’ తర్వాత అక్కినేని నాగచైతన్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతోంది.

ఆ సినిమా నాకు బైబిల్ - మహేష్

సూపర్స్టార్ మహేష్, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా ఎం.బి.ఎంటర్టైన్మెంట్స్, మైత్రిమూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన చిత్రం ’శ్రీమంతుడు‘.

'కీచక' రెడీ ఫర్ రిలీజ్

రివెంజ్ త్రిల్లర్ గా వినూత్నమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కుతున్న కీచక చిత్రం నిర్మాణానంతర కార్య క్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిధ్ధమయింది.

'పాండవుల్లో ఒకడు' మూవీ రివ్యూ

తమిళ దర్శకుడు శంకర్ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తుంటాడు. అలా ఆయన బ్యానర్ ఎస్ పిక్చర్స్ సమర్పణలో తమిళంలో విడుదలైన చిత్రమే కప్పల్. చిన్న చిత్రంగా అక్కడ విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న ఈ కామెడి ఎంటర్ టైనర్ ను మారుతి టీమ్ వర్స్ బ్యానర్ పై