సెప్టెంబర్ 17న వినాయకచవితికి రామ్ 'శివమ్' రెడీ

  • IndiaGlitz, [Monday,July 20 2015]

'పండగ చేస్కో' వంటి ఘనవిజయం తర్వాత రామ్ తెరపై కనిపించబోతున్న చిత్రం 'శివమ్'. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రామ్ సరసన రాశీఖన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ సోమవారం హైదరాబాద్ లో మొదలైంది. ఆర్.ఎఫ్.సిలో ఈ నెల 31 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది.

ఈ సందర్భంగా స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ - ''ఇది హై ఓల్టేజ్ లవ్ స్టోరి. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం జరుపుతున్న షెడ్యూల్ లో పాటలు మినహా పూర్తవుతుంది. వచ్చే నెల పాటల చిత్రీకరణ మొదలుపెడతాం. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.
.బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, యాక్షన్: పీటర్ హెయిన్స్.

More News

షూటింగ్ పూర్తి చేసుకున్న 'సతీ తిమ్మమాంబ'

ఎస్.ఎస్.ఎస్. ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భవ్యశ్రీ ప్రదాన పాత్రలో రూపొందుతున్న హిస్టారికల్ మూవీ ‘సతీ తిమ్మమాంబ’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ అనంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.

నారా రోహిత్ నిర్మాతగా మరో చిత్రం

బాణం, సోలో, ప్రతినిధి, రౌడీఫెలో, అసుర వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో నారారోహిత్ అసుర చిత్రాన్ని అరన్ మీడియా బ్యానర్ పై ప్రెజెంట్ చేసి నిర్మాతల్లో ఒకడిగా వ్యవహరించాడు.

జూలై 31న విడుదలవుతున్న 'మిర్చిలాంటి కుర్రాడు'

నటసింహ నందమూరి బాలకృష్ణతో ‘లయన్’ వంటి హిట్ మూవీని నిర్మించిన నిర్మాత రుద్రపాటి రమణారావు నిర్మాతగా అభిజిత్, ప్రగ్యాజైశ్వాల్ హీరో హీరోయిన్లుగా రుద్రపాటి ప్రేమలత సమర్పణలో ఎస్.ఎల్.వి.సినిమా బ్యానర్పై రూపొందిన చిత్రం ‘మిర్చిలాంటి కుర్రాడు’

90 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న 'కొలంబస్'

సుమంత్ ఆశ్విన్ హీరోగా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఆర్.సామల దర్శకత్వంలో ఆశ్వీనీకుమార్ సహదేవ్ నిర్మిస్తోన్న చిత్రం ‘కొలంబస్’.

'శ్రీమంతుడు' పాటలు విడుదల

అభిమానుల కోసం ఎప్పుడూ మంచి సినిమాలే చేయాని ప్రయత్నిస్తుంటాను. లాస్ట్ టైమ్ డిసప్పాయింట్ చేశాను. అందులో నా తప్పేమైనా ఉంటే నన్ను క్షమించండి.