అల్లు అర‌వింద్ చేతుల మీదుగా శివ‌మ్ ఆడియో రిలీజ్

  • IndiaGlitz, [Saturday,September 12 2015]

యంగ్ హీరో రామ్ న‌టిస్తున్న‌తాజా చిత్రం శివ‌మ్. ఈ సినిమాలో రామ్ స‌ర‌స‌న రాశి ఖ‌న్నా న‌టించింది.ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ రెడ్డి తెర‌కెక్కించారు. స్ర‌వంతి మూవీస్ సంస్థ 30 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న త‌రుణంలో రూపొందిస్తున్న సినిమా కావ‌డంతో శివ‌మ్ చిత్రాన్ని స్ర‌వంతి ర‌వికిషోర్ అత్యంత‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. అక్టోబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న శివ‌మ్ చిత్రం ఆడియో ఆవిష్క‌ర‌ణోత్స‌వం హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో ప్రేక్ష‌కాభిమానులు, సినీ ప్ర‌ముఖులు స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో హీరో రామ్, హీరోయిన్ రాశిఖ‌న్నా, నిర్మాత స్ర‌వంతి ర‌వికిషోర్, గీత ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రెడ్డి, సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్, డైరెక్ట‌ర్ ఎస్వీ క్రిష్ణారెడ్డి, విజ‌య‌భాస్క‌ర్, బ్ర‌హ్మానందం, ర‌చ‌యిత & న‌టుడు త‌నికెళ్ల భ‌ర‌ణి, కెమెరామెన్ ర‌సూల్, న‌టుడు అశోక్ కుమార్ నిర్మాతలు న‌ల్ల‌మ‌ల్ల‌పు బుజ్జి, ఠాగూర్ మ‌ధు త‌దిత‌రులు పాల్గొన్నారు.

శివ‌మ్ ఆడియో సిడిని అల్లు అరవింద్ ఆవిష్క‌రించ‌గా...ధియేట‌ర్ ట్రైల‌ర్ ను దేవిశ్రీప్ర‌సాద్ ఆవిష్క‌రించారు.

స్ర‌వంతి మూవీస్ సంస్థ 30 ఏళ్ల పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా స్ర‌వంతి మూవీస్ సంస్థ‌లో రూపొందించిన తొలి చిత్రం లేడీస్ టైల‌ర్ చిత్ర యూనిట్ డైరెక్ట‌ర్ వంశీ, గీత ర‌చ‌యిత సీతారామశాస్త్రి, త‌నికెళ్ల భ‌ర‌ణి, కెమెరామెన్ హ‌రి అనుమోలు, న‌టి సంధ్య‌, వేమూరి స‌త్య‌నారాయ‌ణ‌ ని స్ర‌వంతి మూవీస్ అధినేత ర‌వి కిషోర్ స‌త్క‌రించారు.

గీత ర‌చ‌యిత సీతారామ‌శాస్త్రి మాట్లాడుతూ...ఈరోజు సినిమా తీస్తే..మ‌ళ్లీ ఆ నిర్మాత క‌నిపిస్తాడో లేదో చెప్ప‌లేని ప‌రిస్థితి. అలాంటిది ఓ నిర్మాణ సంస్థ 30 ఏళ్లు పూర్తి చేసుకోవ‌డం..ఆ సంద‌ర్భంగా ఓ ఫంక్ష‌న్ జ‌రుపుకోవ‌డం నిజంగా అభినందించ‌ద‌గ్గ విష‌యం. నిర్మాత‌కు హీరో ఇమేజ్ తీసువ‌చ్చిన వ్య‌క్తి స్ర‌వంతి ర‌వి కిషోర్. ఒకేసారి నేను, రవికిషోర్ ప్ర‌యాణం ప్రారంభించాం. ఆ స‌మ‌యంలో ర‌వి కిషోర్ ఆఫీస్ లోనే ఉండేవాడిని.ఇది ఒక సినిమా ఆడియో ఫంక్ష‌న్ కాదు...ఇదొక అద్భుత‌మైన కుటుంబం. స్ర‌వంతి సంస్థ‌లో దాదాపు 80 పాట‌లు రాసాను. ఒకే సంస్థ‌లో ఇన్ని పాట‌లు రాయ‌డం అనేది బాహుశా ఈ ఖ్యాతి వేటూరి, ఆత్రేయ గార్కి ద‌క్కిందేమో. ఆత‌ర్వాత నాకే ద‌క్కింది అనుకుంటున్నాను. వంశీ స్ర‌వంతి సంస్థ‌లో సినిమా తీయడం..వాటికి నేను పాటలు రాయ‌డం జ‌రిగింది. పాట‌లు రాయ‌డం ప్రారంభించిన త‌ర్వాత స్ర‌వంతి సంస్థ నా ఇల్లుగా మారింది. శివ‌మ్ అంటూ మంగ‌ళక‌ర‌మ్ గా వ‌స్తున్న‌ ఈ సినిమా విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ..దాదాపు 30 ఏళ్ళ క్రితం అర‌కులో ఆరంభ‌మైంది మా ప్ర‌యాణం. స్ర‌వంతి ఆఫీస్ లో పుట్టి పెరిగిన వాళ్లం. నేను అన్నం తింటున్నాను అన‌డం కంటే ఆనందంగా ఉన్నానంటే కార‌ణం లేడీస్ టైల‌ర్ అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..స్ర‌వంతి మూవీస్ సినిమాలు వ‌స్తున్న‌ప్పుడు నేను మామూలు ప్రేక్ష‌కుడిని. స్ర‌వంతి మూవీస్ నిర్మించిన వార‌సుడోచ్చాడు చిత్రాన్ని చాలా సార్లు చూసాను. స్ర‌వంతి మూవీస్ నిర్మించే సినిమాల్లా నేను తీయాల‌ని నిర్మాత‌ను చూసి ఓ నిర్మాత వ‌చ్చాను. 30 కంగ్రాట్స్. ఎన‌ర్జి అంటేనే రామ్. డాన్స్, ఫైట్స్ లో ఇర‌గ‌దీస్తాడు. ఆల్ ద బెస్ట్ రామ్. దేవిశ్రీ సాంగ్స్ రీ రికార్డింగ్ తో సినిమాని ఎక్క‌డితో తీసుకెళ‌తాడు. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ 24 రిలీజ్. శివ‌మ్ అక్టోబ‌ర్ 2 రిలీజ్. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

విజ‌య‌భాస్క‌ర్ మాట్లాడుతూ...నేను ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వి కిషోర్ లాంటి నిర్మాత ను చూడ‌లేదు. రామ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. శివ‌మ్ ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ అవుతుంది అన్నారు.

డైరెక్ట‌ర్ ర‌మ‌ణ మాట్లాడుతూ..30 ఏళ్లు అవుతున్న‌ ర‌వి కిషోర్ లో ఫ్యాష‌న్, హార్డ్ వ‌ర్క్ త‌గ్గ‌లేదు. హిట్, ఫ్లాపా అనేది చూడ‌రు. టాలెంట్ ఉందా లేదా అనేది చూస్తారు. ఈ సంస్థ మ‌రిన్ని మంచి చిత్రాల‌ను నిర్మించాలి అన్నారు.

డైరెక్ట‌ర్ ఎస్వీ క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ...ఏ ప‌దం వింటే పుణ్యం వ‌స్తుందో..అలాగే ఓ ప‌దం వింటే ఎన‌ర్జి వ‌స్తుంది. అదే రామ్. ఫైట్స‌, డాన్స్...ఒక‌టేంటి అన్ని విధాల ఆడియోన్స్ తో విజుల్స్ వేయిస్తాడు రామ్. ఈ సంస్థ‌లో సినిమాల‌న్నీ దాదాపు మ్యూజిక‌ల్ హిట్స్. వ‌రుస‌గా ఎలా హిట్స్ ఇస్తారు అంటే... నిర్మాణం అంటే ఓ త‌ప‌స్ప‌సులా భావిస్తారు క‌నుకే వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నారు. ర‌వి కిషోర్ తో సినిమా చేయ‌డం అంటే మ‌న సొంతంగా సినిమా తీసుకుంటున్న‌ట్టు ఉంటుంది. ఇలాంటి బ్యాన‌ర్ లో మూడు సినిమాలు చఏసాను. అవ‌కాశం వ‌స్తే మ‌ళ్లీ చేస్తాను అన్నారు.

బ్ర‌హ్మానందం మాట్లాడుతూ...ఈరోజు 30 సంవ‌త్స‌రాల స్ర‌వంతి పండుగ‌. స్ర‌వంతి రవి కిషోర్ అంటే బహుశా తెలియ‌ని వారు ఉండ‌రు. మంచి సినిమా తీయాల‌ని త‌ప‌న ప‌డే అతి కొద్ది మంది నిర్మాత‌ల్లో స్ర‌వంతి రవి కిషోర్ ఒక‌రు. రామ్ ఎన‌ర్జిటిక్ బాంబ్. స్వీటు ప‌ర్స‌న్ లా ఉంటాడు. రామ్ నా అన్న‌య్య‌. న‌న్ను స‌ర‌దాగా త‌మ్ముడు అని పిలుస్తుంటాడు. ఇక రామ్ ఏక్టింగ్ విష‌యానికి వ‌స్తే...ఏక్టింగ్ అంద‌రు చేస్తారు కానీ చాలా ఈజీగా చేస్తాడు. ప‌వ‌ర్ ప్యాక్డ్ ఫిలిమ్ శివ‌మ్. ఈ సినిమాకి దేవిశ్రీ అద్భుత‌మైన సంగీతం అందించారు. శివ‌మ్ అద్భుత‌మైన విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

అశోక్ కుమార్ మాట్లాడుతూ..స్ర‌వంతి రవి కిషోర్ వార‌సుడొచ్చాడు సినిమాకి నేను డిస్ట్రిబ్యూట‌ర్ ని. చాలా ష్యాష‌న్ ఉన్న వ్య‌క్తి ర‌వి కిషోర్. 30 ఏళ్లుగా సినిమాలు తీస్తూ...త‌న‌కంటూ ఓ స్ధానం ఏర్ప‌రుచుకున్నందుకు అభినందన‌లు తెలియ‌చేస్తున్నాను. ఓ ప్రొడ్యూస‌ర్ ఎలా ఉండాలి అనే దానికి దిల్ రాజు, ఎం.ఎస్ రాజు, అల్లు అర‌వింద్, స్ర‌వంతి ర‌వి కిషోర్ లు ఉదాహ‌ర‌ణ అని చెప్ప‌వ‌చ్చు. తెర వెనుక చాలా సాఫ్ట్ గా కనిపించినా కెమెరా ముందుకు వ‌స్తే మాత్రం రామ్ ఎన‌ర్జిటిక్ తో అద‌ర‌గొట్టేస్తాడు. శివ‌మ్ విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ...స్ర‌వంతి రవి కిషోర్ నిర్మాతే కాదు డిస్ర్టిబ్యూట‌ర్ కూడా. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

గీత ర‌చ‌యిత భాస్క‌ర‌భ‌ట్ల ర‌వి కుమార్ మాట్లాడుతూ...ఇంత కాలం ఈ సంస్థ‌లో ప‌ని చేయలేద‌నుకున్నాను. ఇప్పుడు ఈ సంస్థ‌లో రూపొందిన చిత్రానికి పాట‌లు రాయ‌డం సంతోషంగా ఉంది. స్ర‌వంతి సంస్థ‌లో ఫ‌స్ట్ టైం రాయ‌డం...అలాగే దేవిశ్రీ మ్యూజిక్ లో అన్ని పాట‌లు రాయ‌డం కూడా ఫ‌స్ట్ టైం. శివ‌మ్ విజ‌యం సాధంచాలని కోరుకుంటూ నాకు అవ‌కాశం ఇచ్చిన ర‌వి కిషోర్ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు

మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ...స్ర‌వంతి మూవీస్ సంస్థ 30 ఏళ్లు పూర్తి చేసుకోవ‌డం సంతోషంగా ఉంది. పాట‌ల్లో విజువ‌ల్స్ అంత బాగా ఉన్నాయంటే కార‌ణం కెమెరామెన్ ర‌సూల్. భాస్క‌ర‌భ‌ట్ల అన్ని పాటలు బాగా రాసారు. నేను సంగీతం ఇంత బాగా ఇచ్చానంటే కార‌ణం నా టీమ్ వారంద‌రికీ ఈ సంద‌ర్భంగా థాంక్స్ తెలియ‌చేస్తున్నాను. రామ్ తో వ‌ర్క్ చేయ‌డం చాలా ఎన‌ర్జిటిక్ గా ఉంటుంది. ఈ సినిమా అంద‌రికీ ఖ‌చ్చితంగా న‌చ్చుతుంది. శివ‌మ్ సూప‌ర్ హిట్ ఖాయం అన్నారు.

నిర్మాత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ...స్ర‌వంతి ర‌వి కిషోర్ తో నాకు 30 ఏళ్లుగా అనుబంధం ఉంది. సినిమాని నిజంగా ప్రేమించే బ‌హు త‌క్కువ మందిలో ర‌వి కిషోర్ ఒక్క‌రు. రామ్ భ‌విష్య‌త్ లో ఇంకా మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా చేయ‌మ‌ని అడుగుతున్నాను. కానీ అడిగిన ప్ర‌తి సారి నెక్ట్స్ ఇయ‌ర్ చేస్తాను అంటున్నాడు అన్నారు.

హీరోయిన్ రాశిఖ‌న్నా మాట్లాడుతూ..న‌న్ను త‌న ఫ్యామిలీ మెంబ‌ర్ గా ట్రీట్ చేసిన స్ర‌వంతి రవి కిషోర్ గార్కి థాంక్స్. రామ్ చాలా ఎన‌ర్జిటిక్ ప‌ర్స‌న్. దేవిశ్రీ చాలా మంచి మ్యూజిక్ అందించారు. అలాగే కెమెరామెన్ ర‌సూల్ గారు న‌న్ను చాలా బాగా చూపించారు. మంచి పాత్ర ఇచ్చిన డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రెడ్డిగార్కి ధ్యాంక్స్ అన్నారు.

హీరో రామ్ మాట్లాడుతూ...శివ‌మ్, హ‌రిక‌థ చేస్తున్నాను. స్ర‌వంతి మూవీస్ 30 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకోవ‌డం సంతోషంగా ఉంది. దేవిశ్రీతో జ‌గ‌డం త‌ర్వాత మ‌ళ్లీ చేయాలి అనుకున్నాం. కుద‌ర‌లేదు ఇప్పుడు శివ‌మ్ సినిమాకి కుదిరింది. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌తి హీరో శ్రీనివాస‌రెడ్డితో సినిమా చేయాల‌నుకుంటారు. అంద‌రు నాకు ఎన‌ర్జి ఎక్క‌డ నుంచి వ‌స్తుంది అని అడుగుతారు. నాకుఎన‌ర్జి అంటే ఫ్యాన్సే. వాళ్ల నుంచే నాకు ఎన‌ర్జి వ‌స్తుంది అన్నారు