భారీ చిత్రాలతో 'శివలింగ' నిర్మాత రమేష్ పిళ్లై
Saturday, April 8, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై.. రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రమేష్ పి.పిళ్లై నిర్మించిన చిత్రం `శివలింగ`. ఏప్రిల్ 14న ఈ సినిమా రిలీజవుతోంది. రీసెంట్గా గురు చిత్రంతో సక్సెస్ సాధించిన రితిక సింగ్ హీరోయిన్గా నటించిన చిత్రమిది. హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ సహా అన్ని అంశాలతో తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుంది. కన్నడలో శివలింగ పేరుతో శివరాజ్‌కుమార్‌గారు నటించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. డైరెక్టర్ వాసు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. లారెన్స్‌కి కాంచన కంటే మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది.
ఇటీవల రిలీజైన ట్రైలర్ ఆడియెన్లోకి దూసుకెళ్లింది. నేడు అభిషేక్ ఫిలింస్ అధినేత రమేష్ పిళ్ళై పుట్టినరోజు. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ వెచ్చించి తెరకెక్కించిన `శివలింగ` తెలుగులో ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారాయన. ఈ సినిమాతోనే తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. తదుపరి మరిన్ని చక్కని చిత్రాల్ని నిర్మించడమే ధ్యేయంగా పరిశ్రమకి వస్తున్నారు. నేడు పుట్టినరోజు సందర్భంగా రమేష్ పిళ్లైకి శుభాకాంక్షలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments