విమెన్స్ డే వేదికగా భర్త విషయమై నోరు జారిన శివజ్యోతి
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమైన ‘తీన్మార్’ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది యాంకర్ శివజ్యోతి. అందరు న్యూస్ యాంకర్లలాగే ప్రేక్షకులు శివజ్యోతిని చూశారు తప్ప ఓ సెలబ్రిటీ స్టేటస్ అయితే ఇవ్వలేదు. కానీ ‘బిగ్‌బాస్’ మాత్రం ఆమెను సెలబ్రిటీని చేసేసింది. ఆ షోలో అందరితో మంచిగా మెలగుతూ కొన్ని వారాల పాటు ఎలాగోలా నెట్టుకొచ్చింది. కానీ బిగ్‌బాస్ షోలో ఆమె కురిపించిన కన్నీటి వరద మరే కంటెస్టెంట్ కురిపించలేదనే చెప్పాలి. దీంతో ఒకరకంగా ఆమె అంటేనే ప్రేక్షకులకు ఒకరకమైన చిరాకు వచ్చేసింది. హ్యాపీగా చూద్దామని టీవీ ముందు కూర్చుంటే ఈ ఏడుపులేంటిరా బాబు అనుకుని ప్రేక్షకులు బాగా ఫీలయ్యారు.
బిగ్‌బాస్ షో ముగిసింది. ఆ తరువాత శివజ్యోతికి మంచి సెలబ్రిటీ స్టేటసే వచ్చింది. పలు ఛానళ్లలో పలు షోల్లో పాల్గొంటూ వస్తోంది. అయితే విమెన్స్ డే సందర్భంగా ఓ షోలో పాల్గొన్న శివజ్యోతి మరోసారి కన్నీటి వరద పారించింది. దీని కారణమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లాం సంపాదిస్తుంటే కూర్చొని తింటుండు అని తన భర్తను వెక్కిరిస్తున్నారని.. మీకేం తెలుసు మా లైఫ్ కష్టాలు? అంటూ కుళాయి విప్పింది. అయితే నిజానికి శివజ్యోతి భర్త ఏం చేస్తాడనేది ఎవరికీ తెలియదు. అంతగా పట్టించుకునే తీరిక, ఓపిక కూడా ఈ బిజీ లైఫ్‌లో ఎవరికీ లేదు. పైగా చెప్పాలంటే ఏ అనసూయ అంతో.. లేదంటే రష్మీ..మరీ కాదంటే శ్యామల రేంజ్ కూడా లేదామెకు.
అలాంటిది ఆమె భర్త ఏం చేస్తాడనేది ఎవరికి కావాలి? అన్నవాళ్లు కనీసం పదుల సంఖ్యలో కూడా ఉండరు. అలాంటి వారికి వివరణ ఇవ్వబోయి.. తన భర్త ఏమీ చేయడని కూర్చొని తింటాడని ఈ శోక దేవత నిజానికి ఎవరికీ తెలియని విషయాన్ని నోరు జారి ప్రపంచానికి స్వయంగా చెప్పేసింది. దీంతో ప్రేక్షకులు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరో ఏదో అన్నారని తన భర్తను తనే చులకన చేసుకుందని విపరీతంగా విమర్శిస్తున్నారు. ఇటీవల ఆషు రెడ్డి కూడా ఇలాగే చేసింది. ఏదో ఆనందంలో ఏది పడితే అది మాట్లాడేసి.. తరువాత మీడియాపై పడింది. ఆలోచన లేకుండా మాట్లాడే మాటల వల్ల నష్టం రేంజ్ అప్పటికప్పుడు తెలియకపోవచ్చు కానీ తరువాత మాత్రం తెలిసి తీరుతుంది. అప్పుడు ఎవరినో బాధ్యుల్ని చేసి నిందిస్తే ప్రయోజనం ఉంటుంది. జర శోచాయించండి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout