కేసీఆర్‌పై నటుడు శివాజీ షాకింగ్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నటుడు శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. శుక్రవారం నాడు డేటా చోరి వ్యవహారంపై నిశితంగా బోర్డుపై వివరించిన శివాజీ ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. అసలు కేసీఆర్‌ను ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడాడు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
కేసీఆర్ బెన్ఫిట్స్- టార్గెట్స్
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బెన్ఫిట్స్- టార్గెట్స్‌ను శివాజీ ఊహించి చెప్పుకొచ్చాడు. "తెలంగాణకు పోర్టులు లేవు. సొంత పోర్టు కోసం కేసీఆర్‌కు జగన్ సహకారం కావాలి. వాన్‌పిక్ భూముల్లో పోర్టు ఏర్పాటు చేసుకునేందుకు జగన్ సహకారం కేసీఆర్‌కు అవసరం. రాయలసీమ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ఉంచడం. తద్వారా ఏపీలో వ్యవసాయాన్ని సమతుల్యత లేకుండా చేయడం. రెండు రాష్ట్రాల్లో ఎవరికీ అర్థం కాని విషయం డేటా చోరీ. అన్నింటికీ మూల బిందువు కేసీఆర్. కేసీఆర్ అద్భుత రాజకీయ చతురతకు ఇది మచ్చుతునక.
గత ఎన్నికల్లో తొలగించిన ఓట్లపై త్వరలో హైకోర్టు తీర్పు రాబోతోంది. అందుకే ఇప్పుడు డేటా చోరీ అంశాన్ని తెరమీదకు తెచ్చారు.
డేటా అమ్ముకోవడం అందరూ చేసే వ్యాపారం. ప్రశాంత్ కిశోర్ కూడా డేటా అమ్ముకుంటారు. సమగ్ర సర్వే వివరాలను కేసీఆర్ తెలివిగా వాడుకున్నారు" అని కేసీఆర్‌పై శివాజీపై షాకింగ్ కామెంట్ చేశాడు
ఇదీ కథ..
"ఎన్నికల డేటాతో సర్వేను బేరీజు వేసుకుని ఓట్లను తొలగించారు. అప్పట్లో భన్వర్‌లాల్‌తో కేసీఆర్ ఇదే అంశంపై ఫోన్ చేసి మాట్లాడారు. ఎన్నికల కమిషన్ తీరుపై మర్రి శశిధర్‌రెడ్డి కోర్టుకు కూడా వెళ్ళారు. అనధికారిక లెక్కల ప్రకారం ప్రతి నలుగురిలో ఒక ఓటు తొలగించారు.
తెలంగాణలో 60 లక్షల ఓట్లు తొలగించినట్లు అనధికారిక అంచనా. తెలంగాణ ఫార్ములానే అన్నిచోట్లా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలనూ కేంద్రం ఆదేశించింది. సుప్రీం జోక్యంతో ఈ ఆదేశాలను ఉపసంహరించుకున్నారు" అని శివాజీ కామెంట్స్ చేశాడు.
అంతటితో ఆగని ఆయన.. రానున్న ఎన్నికల్లో టీడీపీని ఓడించడమే సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నాడు. జగన్‌ను సీఎం చేయాలని కేసీఆర్ ఎంతగానో ఎదురు చూస్తున్నారని... చంద్రబాబును చక్రబంధంలోకి నెట్టడమే ఆ ఇద్దరి పని అని శివాజీ జోస్యం చెప్పాడు. ఎన్నికలకు చంద్రబాబును సమాయత్తం కాకుండా చేసి మోదీని సంతోషపర్చడమే వారి టార్గెట్ అని శివాజీ చెప్పుకొచ్చాడు. "గత ఏడాదిలో ఏపీ ఆదాయం తెలంగాణ కంటే వెయ్యి కోట్లు ఎక్కువ. ఇది ఊహించని పరిణామం.. అందుకే చంద్రబాబు ఉంటే భవిష్యత్తులో తెలంగాణకు అందనంత దూరంలో ఏపీ ఉంటుంది. చంద్రబాబు పాలన కొనసాగితే కేసీఆర్‌పై ఒత్తిడి ఉంటుంది. చంద్రబాబు మళ్లీ సీఎం అయితే తెలంగాణలో కేసీఆర్ తప్పక పని చేయాల్సిన పరిస్థితి" అని శివాజీ చెప్పుకొచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments