'డేటా చోరి' : సంచలన నిజాలు బయటపెట్టిన నటుడు శివాజీ

  • IndiaGlitz, [Friday,March 08 2019]

‘డేటా చోరీ’ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై అప్పుడెప్పుడో ‘ఆపరేషన్ గరుడ’.. వడ అంటూ మీడియా ముందుకు వచ్చిన నటుడు శివాజీ పెద్ద హడావుడే చేశాడు. అంతేకాదు అటు వైసీపీ అధినేత జగన్.. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్.. వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఏపీ సీఎం చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశాడు. డేటా చోరీలో అసలేం జరిగింది..? చోరీ చేసిందెవరు..? అసలు ఈ వ్యవహారం ఎక్కడ్నుంచి మొదలైంది..? అని బోర్డులో ఆయన నిశితంగా స్కెచ్ గీసి వివరించి షాకింగ్ నిజాలు బయటపెట్టాడు.

శివాజీ మాటల్లోనే...

రానున్న ఎన్నికల్లో టీడీపీని ఓడించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం. జగన్‌ను సీఎం చేయాలని కేసీఆర్‌ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చంద్రబాబును చక్రబంధంలోకి నెట్టడమే ఆ ఇద్దరి పని. ఎన్నికలకు చంద్రబాబును సమాయత్తం కాకుండా చేసి మోదీని సంతోషపర్చడమే వారి టార్గెట్. గత ఏడాదిలో ఏపీ ఆదాయం తెలంగాణ కంటే వెయ్యి కోట్లు ఎక్కువ. ఇది ఊహించని పరిణామం.. అందుకే చంద్రబాబు ఉంటే భవిష్యత్తులో తెలంగాణకు అందనంత దూరంలో ఏపీ ఉంటుంది. చంద్రబాబు పాలన కొనసాగితే కేసీఆర్‌పై ఒత్తిడి ఉంటుంది. చంద్రబాబు మళ్లీ సీఎం అయితే తెలంగాణలో కేసీఆర్‌ తప్పక పని చేయాల్సిన పరిస్థితి అని శివాజీ చెప్పుకొచ్చాడు.

వెన్నుదన్నును.. వెన్నుపోటుగా!

చంద్రబాబుపై కేసీఆర్‌కు కోపం. చంద్రబాబు తనకంటే గొప్ప నాయకుడు అనే పేరు ఉండటాన్ని కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు పలు మార్గాలు ఎంచుకుంటున్నారు. అందుకే ఐటీ గ్రిడ్‌ను తెరమీదకి తీసుకొచ్చారు. ఎన్నికల సమయానికి చంద్రబాబును దొంగగా తేలుస్తారు. అయినా చంద్రబాబును ఏమీ చేయలేరు. ఈ విషయంలో జగన్‌ సెల్ఫ్‌గోల్‌ చేశారు. ఏపీ రాజకీయం చంద్రబాబు-కేసీఆర్‌గా మారిపోయింది. వెన్నుదన్నును వెన్నుపోటుగా మార్చినట్టే ఇప్పుడూ చేయాలని చూస్తున్నారు. ఏదైనా రాజకీయంగా చేయండి.. కుట్రలు చేయవద్దు. కుట్రలు చేసుకుంటే ఏపీ-తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కలిసి బతకలేరు అని శివాజీ జోస్యం చెప్పాడు.

ఐటీగ్రిడ్ జీరో.. నిరూపించకపోతే ఉరేసుకుంటా..!

ఐటీగ్రిడ్‌ జీరో.. వారే నష్టపోతారు.. చంద్రబాబు నష్టపోరు.. ఇది నా చాలెంజ్‌. అభివృద్ధికి ఓటేయండి.. లేకపోతే ఏపీ ప్రజలకు తిప్పలే. ఏపీకి వచ్చేయండి.. 2021 నుంచి అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్‌లో ఉంటే భయపడాలా ?. ఆంధ్రోడంటే పాకిస్తాన్‌ వాడిలా చూస్తున్నారు. ప్రతిదానికీ పొగుడుతూ బతకాలా?. ఏపీ అభివృద్ధిని చూడండి.. తెలంగాణలో ఏమైనా ఒక నిర్మాణం చేపట్టారా ?. మీరు చెప్పుకోదగిన కంపెనీ తీసుకొచ్చారా ?. ఆంధ్రా వాడి సత్తా ఏమిటో చెబుతా.. నిరూపించకపోతే నన్ను ఉరితీయండి. ప్రశ్నిస్తే ఇబ్బంది పెడతారా ?. హైటెక్‌ సిటీని పడగొడతారనే సమాచారం ఉంది. చరిత్రను ఎవరూ కూల్చలేరు అని శివాజీ చెప్పుకొచ్చాడు.

పోలీస్ శాఖపై..

గ్రేటర్‌ పరిధిలో 40 లక్షలకు పైగా సెటిలర్లు ఉన్నారు. ఈసీని కలవడానికి ముందే సమగ్ర సర్వే చేశారు. సమగ్ర సర్వేలో ప్రతి ఒక్కరి వివరాలు తీసుకున్నారు. ఎస్‌ఆర్‌డీహెచ్‌ అప్లికేషన్‌ తెలంగాణ పోలీస్ శాఖ తయారు చేసింది. అప్లికేషన్‌ కోసం టెండర్లు కూడా పిలిచారు
ఈసీ, సీఎస్‌, గ్రేటర్‌ కమిషనర్‌ కలసి పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలనుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఈసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఓట్లను తొలగించడానికి ఓ ప్రణాళికను తయారు చేశారు. ఈసీ వద్ద నుంచి ఆధార్‌ డేటా, ఓటర్ లిస్టును తీసుకున్నారు: శివాజీ
ప్రభుత్వం వద్ద ఉన్న సమగ్ర సర్వే వివరాలను ఈసీ దగ్గరున్న జాబితాతో పోల్చి ఓట్లను తొలగించారు. సమగ్ర సర్వేను తెలంగాణ ప్రభుత్వం పార్టీ కోసం వాడుకుంది. డేటా చోరీ జరిగిందని గుండెలు బాదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం మా ప్రశ్నకు సమాధానం చెప్పాలి అని శివాజీ డిమాండ్ చేశాడు.

ఈసీ సహకరించింది..

కేసీఆర్‌కు ఈసీ సహకరించింది. నిబంధనల ప్రకారమే వెళ్తున్నామంటూ రజత్‌కుమార్‌ వ్యూహాత్మకంగా కేసీఆర్‌కు సహకరించారు. మర్రి శశిధర్‌రెడ్డి ఫిర్యాదులో వివరాలన్నీ ఉన్నాయి. ఫిర్యాదుపై ఎవరూ స్పందించలేదు. కేంద్రం నుంచి టీఆర్‌ఎస్‌కు పూర్తి సహాయ సహకారాలున్నాయి. ఓట్ల తొలగింపు స్మూత్‌గా సాగిపోయింది. అదే తరహాలో ఏపీపై కేసీఆర్‌ గురిపెట్టారు. ఓట్ల తొలగింపు మీ పరిధిలోకి రాదు.. ఈసీ పరిధిలోకి వస్తుంది అని ఆయన చెప్పుకొచ్చాడు.

నాకు ఎవరిపై అక్కసు లేదు.

నాకు ఎవరిపై అక్కసు లేదు. రాజకీయ దురుద్దేశాలు లేవు. ఒక పౌరుడిగా నిజాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఆగస్టు 28న అమిత్‌ షా మీటింగ్‌లో సీఎంలను ఆయనే స్వయంగా అడిగారు. మన పథకాలతో లబ్ధి పొందుతున్న వారి వివరాలు అడిగారు. లబ్ధిదారుల సమచారం దగ్గర పెట్టుకోవడం నేరం అయితే అందరి కంటే ముందు నేరం చేసిన వాడు అమిత్‌షా. 22 కోట్ల కుటుంబాల డేటా అమిత్‌షా దగ్గరుంది. అది డాటా చౌర్యం కాదా?. రైల్వేజోన్‌, ప్రత్యేక హోదా తెరమరుగు చేసేందుకే లేని డేటా గొడవపై హడావుడి చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు సిట్‌ వేసి ఏం చేస్తారు?. ఏపీ ప్రభుత్వం డేటా పోతే ఐటీ గ్రిడ్‌ను ఎందుకు అడుగున్నారు అని శివాజీ ప్రశ్నల వర్షం కురిపించాడు.

కేంద్రం ఏం చేస్తోంది..!?

చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం తప్పుచేసినట్లైతే కేంద్రం ఏం చేస్తోంది?. కేంద్ర దర్యాప్తు, నిఘా సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న సీఎంను ఎందుకు ప్రయోగిస్తున్నారు. నాకు ఏపీలో కూడా మాట్లాడే స్వేచ్ఛ లేదా?. నా రాష్ట్రానికి ఇదేం దౌర్భాగ్యం. డేటా వివాదం పుట్టు పూర్వోత్తరాలపై సమగ్ర వీడియో చేశాను. పెన్‌ డ్రైవ్‌లో మీకు ఇస్తున్నా.. ప్రతి పౌరుడు ఇది చూడాలి. ఏపీలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు శివాజీ పెన్‌ డ్రైవ్‌లు ఇచ్చాడు.

More News

కేసీఆర్‌పై నటుడు శివాజీ షాకింగ్ కామెంట్స్

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నటుడు శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

'మా' ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా హేమ పోటీ...

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. మా అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో జరుగుతున్న ఈ ఎన్నికలు అటు నరేశ్..

మ‌హేష్ సినిమాలో లేడీ సూప‌ర్‌స్టార్‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ సినిమా అంటేనే క్రేజ్  ఓ రేంజ్‌లో ఉంటుంది.

విక్ర‌మ్ సాంగ్‌

విల‌క్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్ న‌టుడే కాదు.. మంచి సింగ‌ర్ కూడా. ఇప్పుడు ఈయ‌న హీరోగా న‌టిస్తున్న చిత్రం `క‌డరం కొండాన్`.

'సీత' రిలీజ్ డేట్‌

వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా