పవన్ కళ్యాణ్ పాటను ఆవిష్కరించిన మా అధ్యక్షులు శివాజీరాజా

  • IndiaGlitz, [Friday,August 18 2017]

'మొగుడ్స్ పెళ్లామ్స్, దొంగోడి పెళ్లి' చిత్రాల సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ స్వతహాగా పవన్ కళ్యాణ్ కి అభిమాని. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన (పవన్ కళ్యాణ్) సినిమాల టైటిల్స్ ను తీసుకుని ఓ పాటను రూపొందించారు. ఇటీవలే ఫిలింఛాంబర్ లో ఈ పాటను 'మా' అధ్యక్షులు శివాజీరాజా ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమం లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్, సింగర్ వేణు, మోహన్ గౌడ్, రచయిత మరుధూరి రాజా లతో పాటు ఎమ్ జైరాజ్, పి. వెంకటేష్, డి. సురేష్ బాబు, డి. సాంబిరెడ్డి, టి. భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ మాట్లాడుతూ.. నేను ఎంతో ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారిపై ఈ పాటను రూపొందించడం చాలా ఆనందం గా వుంది. ఆయన స్ఫూర్తి తో ఈ పాటను ప్రజలకు చేరవేసి, వెయ్యిమందికి సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ బృహత్తర కార్యక్రమంకి శ్రీకారం చుట్టడం జరిగింది. అతి త్వరలో వెయ్యిమంది అభాగ్యులకు, అన్నదానం, వస్త్రదానం చేయబోతున్నాము. ఈ సహాయ కార్యక్రమానికి శివాజీరాజా గారు, ఆర్. కె. గౌడ్ గారు తమ చేయూతను అందిస్తున్నందుకు వారికి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము..అన్నారు.