వైసీపీలోకి నటుడు శివాజీరాజా.. ముహూర్తం ఫిక్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రముఖ నటుడు 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) మాజీ అధ్యక్షుడు శివాజీరాజా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్ వరకు చాలా మంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరిశీలించుకున్నారు.
ముఖ్యంగా టాలీవుడ్లో ఒకరిద్దరు కాదు డజన్ల మంది అటు టీడీపీ.. ఇటు వైసీపీ.. జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా శివాజీరాజా కూడా వైసీపీ గూటికి చేరాలని ఫిక్స్ అయిపోయారు. ఈ నెల 24న నర్సాపురంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో శివాజీ రాజా కండువా కప్పుకొన్నారు.
వైసీపీలోకే ఎందుకు..?
మా ప్రస్తుత అధ్యక్షుడు, మెగా బ్రదర్ నాగబాబు ఈ ఇద్దరు అంటే శివాజీరాజాకు అస్సలు పడట్లేదు. మా ఎన్నికల్లో దగ్గరుండి ఓడించాడని.. తన గోల్డేజ్ హోమ్ కలను పాడు చేశారని నాగబాబుపై ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టి మరీ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం విదితమే. నాగబాబు తాజాగా తమ్ముడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
ఆయన రాజకీయాల్లోకి రావడంతో శివాజీకి మరింత కసిపెరిగింది.! ఇక నరేశ్ విషయానికొస్తే.. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న ఆదిశేషగిరిరావు కొన్ని రోజుల క్రితమే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు బావ గల్లా జయదేవ్, నరేశ్ కుటుంబం టీడీపీలో ఉండటంతో సైకిలెక్కడానికి శివాజీకి మార్గాలు లేకపోయాయి.
అటు నాగబాబు జనసేనలోకి.. ఇటు నరేశ్ కుటుంబం టీడీపీలో ఉండటంతో ఇక మిగిలిన ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే. అందుకే వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు శివాజీ రాజా ఫిక్స్ అయిపోయారు. అయితే ఈయన వైసీపీలో చేరితే ఆ పార్టీ అధినేత ఏ మేరకు స్థానం కల్పిస్తారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments