close
Choose your channels

నరేశ్ ఒకటో తేదీలోగా డబ్బులు ఖాతాలో వెయ్: శివాజీ రాజా

Tuesday, March 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నరేశ్ ఒకటో తేదీలోగా డబ్బులు ఖాతాలో వెయ్: శివాజీ రాజా

'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ముగిసినప్పటికీ వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మా అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం విషయంలో శివాజీ రాజా అడ్డంకులు సృష్టిస్తున్నారని.. ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టిన నరేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఆయన ఓ ఫైల్‌ను చూపిస్తూ పెద్ద హంగామానే చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలన్నింటికీ శివాజీ రాజా ప్రెస్‌మీట్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

మిగతా డబ్బులేమైంది?

"ప్రతి సంవత్సరమూ 'మా' డైరీని అందంగా డిజైన్ చేసి వేస్తాం.. ఈ సంవత్సరమూ బాగా చేశాం. డైరీ వేసినందుకు రూ. 14.20 లక్షలు వచ్చింది అని గొప్పగా చెప్పుకున్న నరేశ్, కేవలం రూ. 7.20 లక్షలు మాత్రమే ఖాతాలో వేశారు. మిగతా డబ్బు ఏమైంది..? నేను లెక్కలు చెప్పాల్సిన సమయం వచ్చింది.

ఒకటో తేదీలోగా మిగతా డబ్బు 'మా' ఖాతాలో వేయాలి. మిగతా డబ్బు ఎక్కడుందో చెప్పి, వాళ్లు ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది" అని ఈ సందర్భంగా నరేశ్‌కు శివాజీ రాజా సలహా ఇచ్చారు. అయితే శివాజీ కామెంట్స్‌పై నరేశ్ ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment