నాగబాబుకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా!

  • IndiaGlitz, [Tuesday,March 19 2019]

రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడీ పదం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెగ వినిపిస్తోంది. అయితే అది కాస్త టాలీవుడ్‌కూ పాకింది. ఎస్ నాకు గిఫ్ట్ ఇచ్చారు.. నేను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ ఇండస్ట్రీలో కొందరు చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఏ క్షణాన ఈ పదం అన్నారోగానీ రిటర్న్ గిఫ్ట్ అనే పదం మాత్రం తెగపాపులర్ అయిపోయింది. అయితే ఇలా గిఫ్ట్‌లు ఇస్తామంటున్నోళ్లు ఏ మాత్రం ఇస్తారో అనేది చూడాల్సి ఉంది.

'మా' ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మరోసారి మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా మీడియా ముందుకు వచ్చారు. వచ్చీ రాగానే మా కొత్త అధ్యక్షుడు నరేశ్, మెగా బ్రదర్ నాగబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తనపై మా కొత్త అధ్యక్షుడు నరేశ్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అంతేకాదు ఏకంగా మెగా బ్రదర్‌కే సవాల్ విసిరారు.

త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా..

నాగబాబు నాకు 30 ఏళ్ల స్నేహితుడు. నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు. చెబుతాను. అది తరువాత చెబుతాను. నాకు ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉంది. నేను కుట్రలు చేసేవాడినో.. ఆపదలో ఉంటే ఆదుకునే మనిషినా అనేది మీడియా మొత్తానికీ తెలుసు.. నాగబాబు విషయం తర్వాత మాట్లాడుతాను అని శివాజీ రాజా చెప్పుకొచ్చారు.

నాకల పై నీళ్లు చల్లారు..!

నా కల గోల్డేజ్-ఓల్డేజ్ హోమ్‌పై నీళ్లు చల్లారు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటమికి ఇదో కారణం. ఎక్కడ్నుంచో వచ్చి గోల్డేజ్ హోమ్ కడితే క్రెడిట్ అంతా నాకే వస్తుందనే అక్కసుతోనే ఇలా చేశారు. కొంత మంది పన్నిన కుట్రలో నేను బలైపోయాను. ఈ పేరు వద్దు ఏమీ వద్దు గోల్డేజ్ హోమ్ ఎవరు కడితే కాశీ నుంచి నీళ్లు తెచ్చి కాళ్లు కడుగుతాను మీరే నిజమైన హీరో అవుతారు అని శివాజీ రాజా సెటైరికల్‌గా మాట్లాడారు. అయితే ఈ రిటర్న్‌గిఫ్ట్ వ్యాఖ్యలపై నాగబాబు ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

నరేశ్ నీకు ధైర్యముంటే...: శివాజీరాజా

'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ముగిసినప్పటికీ వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మా అధ్యక్ష పదవికి ప్రమాణం చేసేందుకుగాను మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా

జనసేన తరఫున ఎంపీగా మాజీ జేడీ పోటీ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈయన్ను విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా జనసేన అధిష్టానం ప్రకటించింది.

'లక్ష్మిస్ ఎన్టీఆర్' రిలీజ్‌కు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మిస్ ఎన్టీఆర్'.. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెరకెక్కించిన 'లక్ష్మీస్ వీర గ్రంథం' సినిమాల విడుదలను ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

అఖిల్‌తో కైరా...

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చారు కానీ.. మంచి స‌క్సెస్ కోసం వెయిట్ చేయాల్సి వ‌స్తుంది. అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలు బాక్సాఫీస్

'లక్ష్మీస్ ఎన్టీఆర్' వాయిదా

అనుకున్న‌ట్లే అయ్యింది. దివంగ‌త నేత ఎన్టీఆర్ జీవితంలో చ‌ర‌మాంక ద‌శ‌లో ఎదుర్కొన్న రాజ‌కీయ ఆటు పోట్ల‌ను, ల‌క్ష్మీ పార్వ‌తిని పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆయ‌న జీవితంలో