Bigg Boss Telugu 7 : బిగ్‌బాస్ సర్‌ప్రైజ్.. ఎమోషనలైన శివాజీ, ప్రియాంక.. యావర్‌తో కలిసిపోయిన అర్జున్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగు ఈ వారంతో ముగియనున్న సంగతి తెలిసిందే. గత వారం శోభాశెట్టి ఎలిమినేట్ కాగా.. అర్జున్, అమర్‌దీప్, శివాజీ, ప్రియాంక, ప్రిన్స్ యావర్‌లు ఫినాలే వీక్‌లో అడుగుపెట్టినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఈ వారం ఎలాంటి నామినేషన్స్, గేమ్స్, టాస్క్‌లు లేకుండా కంటెస్టెంట్స్‌ని ఫ్రీగా వదిలేశాడు బిగ్‌బాస్. ఇన్ని రోజుల జర్నీలో వారు సాధించినది, తీపి గుర్తులు, సంతోషం, బాధ అన్నింటిని గుర్తుచేస్తున్నాడు బిగ్‌బాస్. నిన్న అమర్‌దీప్, అర్జున్ అంబటిలు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి తమ జర్నీని చూసుకున్నారు.
ఇవాళ ప్రియాంక, శివాజీలకు ఆ అవకాశం కల్పించాడు. అయితే ఈ ఎపిసోడ్ కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా కంటతడి పెట్టించింది. బుక్ ఆఫ్ మెమొరీస్ అంటూ శివాజీని సర్‌ప్రైజ్ చేశాడు బిగ్‌బాస్. అతనికి సంబంధించిన ఫోటోలను చూసుకుని శివాజీ భావోద్వేగానికి గురయ్యాడు. పాతికేళ్ల సినీ ప్రస్థానంతో ఓ ఎత్తయితే, బిగ్‌బాస్ జర్నీ మరో ఎత్తు అంటూ శివాజీ చెప్పుకొచ్చాడు. మీ గాయం మిమ్మల్ని ఎంత బాధించినా, ఓటమి వైపు చూడలేదు.. మీ అబ్బాయి డాక్టర్‌గా రావడంతో మీ బాధను మరచిపోయారు. చాణుక్యుడిలా పావులు కదిపి.. కాకపోతే కాఫీ మాత్రం మీపై పైచేయి సాధించిందని బిగ్‌బాస్ చెప్పాడు. మీ ఆటతీరే మిమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టిందని కాంప్లిమెంట్ ఇవ్వడంతో శివాజీ ఎమోషనల్ అయ్యారు.
అనంతరం ప్రియాంకను ఆహ్వానించిన బిగ్‌బాస్ .. ఆమెకు సంబంధించిన ఫోటోలను ప్రదర్శించారు. అందులో తన బాయ్‌ఫ్రెండ్ శివతో వున్న ఫోటోని చూసి ప్రియాంక కన్నీటి పర్యంతమైంది. సింపుల్‌గా వుండే మీరు.. శివంగి ప్రియాంకగా నామినేషన్స్‌లో ఎంత బలమైన కంటెస్టెంట్ అనేది తెలిసింది.. ఇంటికి ఆయువు పట్టులాంటి కిచెన్‌కి వున్న శక్తిని అర్ధం చేసుకుని అక్కడి నుంచి ఆట మొదలెట్టారని ప్రశంసించారు. ఎవరెన్ని మాటలన్నా వాటి నుంచి తేరుకుని మీ ఆటపై దృష్టి పెట్టారని.. పొట్టి పిల్ల కాదు గట్టి పిల్ల అని .. మీరు 100 శాతం పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీ పట్టుదలే మిమ్మల్ని జీవితంలో అగ్రస్థానంలో నిలబెడుతుందని వీడియో ప్లే చేశాడు బిగ్‌బాస్. ఇది చూస్తున్నంత సేపు ప్రియాంక ఏడుస్తూనే వుంది.
ఇక ఇవాళ్టీ ఎపిసోడ్‌లో అర్జున్, ప్రిన్స్ యావర్ మధ్య గొడవకు ఫుల్ స్టాప్ పడింది. కొన్ని వారాల క్రితం జరిగిన నామినేషన్స్‌లో యావర్‌కు, అర్జున్‌కు మధ్య గొడవ జరిగింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడిన సమయంలో యావర్ కారణంగా అర్జున్ పాస్ కోల్పోయాడు. అదే కారణాన్ని చెప్పి యావర్‌ను నామినేట్ చేశాడు అర్జున్. దీంతో యావర్ కూడా అర్జున్‌ని రివర్స్ నామినేట్ చేశాడు. ఇది అర్జున్‌కు నచ్చకపోగా.. హౌస్‌లో వున్నంత వరకు యావర్‌తో మాట్లాడేది లేదని తేల్చిచెప్పాడు . ఇప్పటి వరకు దానిని నిలబెట్టుకున్నాడు. కానీ నిన్న జర్నీని చూసొచ్చిన తర్వాత అర్జున్ మనసు మారిపోయింది. యావర్‌ను గట్టిగా హత్తుకున్నాడు , ప్రిన్స్ సైతం ఎమోషనల్ కావడంతో పక్కనేవున్న శివాజీ, ప్రశాంత్‌లు సంతోషించారు. దీంతో ఇప్పుడు హౌస్‌లో వున్న ఆరుగురి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా పోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com