Bigg Boss 7 Telugu : శివాజీ బయటికి ఎందుకెళ్లారంటే.. మళ్లీ ఏడ్చిన అశ్విని, విసిగించేస్తోన్న రైతు బిడ్డ
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ హౌస్ నుంచి నయని పావని ఎలిమినేట్ కావడంతో కంటెస్టెంట్స్, ప్రేక్షకులు సహా హోస్ట్ నాగార్జున సైతం ఎమోషనల్ అయ్యారు. గత కొన్నేళ్లలో బిగ్‌బాస్ ఇంట్లో ఓ కంటెస్టెంట్ కోసం మొత్తం ఇంటి సభ్యులు కంటతడి పెట్టడం ఇదేనంటూ నాగ్ సైతం పేర్కొన్నారు. ఇక రతిక, శుభశ్రీ, దామినిలలో ఒకరిని ఓటింగ్ ద్వారా హౌస్‌లోకి రీఎంట్రీ ఇప్పిస్తామని నాగ్ చెప్పాడు. అయితే అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తిని కాకుండా తక్కువ వచ్చిన వ్యక్తికి ఛాన్స్ ఇస్తామని ట్విస్ట్ ఇచ్చాడు. మరోవైపు సోమవారం కావడంతో ఎప్పటిలాగే నామినేషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటి వరకు పాతవాళ్లని ఆటగాళ్లుగా.. వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఐదుగురిని పోటుగాళ్లు పిలిచిన బిగ్‌బాస్ ఇకపై అందరూ సమానమేనని తేల్చాడు.
నామినేషన్స్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ ఇంట్లో వుండేందుకు అనర్హులుగా భావించే ఇద్దరు ఇంటి సభ్యుల ముందు వున్న కుండలని పగులగొట్టాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించాడు. అలా ప్రశాంత్.. సందీప్, తేజ, అమర్‌దీప్.. భోలే, అశ్విని, పూజామూర్తి.. భోలే, అశ్విని, సందీప్.. భోలే, ప్రశాంత్, అర్జున్ .. భోలే, అశ్విని, ప్రియాంక.. అశ్విని, భోలే, టేస్టీ తేజ.. పూజ, ప్రశాంత్‌లను నామినేట్ చేశారు. ఎక్కువమంది ప్రశాంత్, భోలే షావలి, అశ్వినిలను టార్గెట్ చేయడంతో వీరు ఇంటి సభ్యులపై విరుచుకుపడ్డారు. లాజిక్కులు లాగుతూ వాగ్యుద్దానికి దిగడంతో సోమవారం నాటి ఎపిసోడ్ టైం మొత్తం వీరే తినేశారు . దీంతో కేవలం ఏడుగురు మాత్రంమే తమ నామినేషన్స్ పూర్తి చేశారు.
అమర్‌దీప్, పూజామూర్తి, ప్రియాంక, అర్జున్‌లు తనను నామినేట్ చేసేసరికి అశ్విని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనతో ఎవరూ కలవట్లేదని, మాట్లాడట్లేదనే ఆమె రీజన్ చెప్పింది. అశ్వినికి ఏం అర్ధం కాదు.. ప్రతీ విషయాన్ని మూడు నాలుగు సార్లు చెప్పాల్సి వస్తోంది అంటూ అందరూ అనడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. నామినేషన్స్‌లో కెమెరా కంట్లో పడటానికి, ఫుటేజ్ ఇవ్వడానికి రైతుబిడ్డ స్ట్రాటజీ వాడినట్లుగా అనిపిస్తోంది. టాస్క్‌ల్లో బాగా ఆడటం, ఇతర సమయాల్లో శివాజీ వెనుక తిరగడం చేస్తూ వస్తున్నాడు పల్లవి ప్రశాంత్. నామినేషన్ సమయంలో సందీప్ వాదిస్తున్నప్పుడు విషయాన్ని డైవర్ట్ చేస్తూ .. తనను మాట్లాడితే ఊరోడు అని అన్నాడని కేకేలు పెట్టాడు ప్రశాంత్. పొలం, అన్నంపై ఒట్టు వేయమని సందీప్ అడిగితే .. నేను అలా చేయనంటూ ఏదో చెప్పాడు.
ఇక ఆదివారం నయని పావని ఎలిమినేషన్ అయ్యే సమయంలో ఆమె బాధ చూడలేక తన బదులు నేను వెళ్తానంటూ శివాజీ .. నాగార్జునను అడిగాడు. ఆ వెంటనే తలుపులు ఓపెన్ కావడ శివాజీ బయటకు వెళ్లడం జరిగింది. దీంతో ఆయన హౌస్‌ను వీడారా అనే సస్పెన్స్ కొనసాగింది. దీనికి బిగ్‌బాస్ తెరదించాడు. నిజానికి ఓ గేమ్ ఆడుతున్నప్పుడు శివాజీ భుజానికి గాయమైంది. అయినప్పటికీ బాధను భరిస్తూనే శివాజీ పార్టిసిపేట్ చేశాడు. అది కొంచెం తీవ్రం కావడంతో ఆయనకు ఎక్స్‌రే తీయించి.. తిరిగి రాత్రికి హౌస్‌కి తీసుకొచ్చాడు. అయితే శివాజీ వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని ఆయనను ఎలిమినేట్ చేసి రెస్ట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com