Bigg Boss 7 Telugu : మీ ఇద్దరి కోసమే వుంటున్నా.. శివాజీ కంటతడి, నవ్వులు పూయించిన శోభాశెట్టి - తేజ
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగులో నామినేషన్ల పర్వం ముగిసింది. భోలే షావళిపై ప్రియాంక, శోభాశెట్టిలు విరుచుకుపడటంతో మంగళవారం హౌస్ హీటెక్కింది. ఇక ఫ్రెండ్ అనుకున్న శోభాశెట్టి తనకు వెన్నుపోటు పొడుస్తూ తననే నామినేట్ చేయడంతో టేస్టీ తేజ తట్టుకోలేకపోయాడు. ఇదే విషయాన్ని ఆమెను అడగగా ఫ్రెండ్‌షిప్ .. ఫ్రెండ్‌షిప్పే నామినేషన్ .. నామినేషనే అని కుండబద్ధలు కొట్టింది. గాయంతో బాధపడుతున్న శివాజీకి హౌస్‌లో అస్సలు వుండబుద్ధి కావడం లేదు. వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్ కానీ , కంటెస్టెంట్స్ కానీ ఆయనను పట్టించుకోవడం లేదు. దీంతో ఇక నా వల్ల కావడం లేదు.. మీ ఇద్దరి కోసం (పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్) కోసమే భరిస్తున్నా అంటూ యావర్‌తో చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు.
నామినేషన్సే రెండు రోజుల పాటు జరగడంతో టైం వృథా అయిపోయింది. దీంతో బిగ్‌బాస్ ఈ వారం కెప్టెన్ కోసం టాస్క్ పట్టాడు. అదే గ్రహంతరవాసి టాస్క్. ఒక స్పేస్ షిప్ గులాబీపురం, జిలేబీపురం మధ్యలో క్రాష్ అయ్యిందని.. ఎవరైతే గ్రహంతరవాసులను మెప్పిస్తారో వారికి ఆ ఊరి నుంచి కెప్టెన్సీ వస్తుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ఇంటి సభ్యులు గులాబీపురం, జిలేబీపురంగా విడిపోయారు. ఇందులో గులాబీపురం సర్పంచ్‌గా శోభాశెట్టి.. ఆమెకు మాజీ భర్తగా తేజ.. ఎన్ఆర్ఐగా ప్రిన్స్ యావర్, టీస్టాల్ నడుపుకునే అబ్బాయిగా అమర్‌దీప్, శోభాతో తిరిగే వ్యక్తిగా గౌతమ్, చిల్లరగా తిరిగే అమ్మాయిగా పూజా నటించారు.
జిలేబీపురం విషయానికి వస్తే.. ప్రియాంక సర్పంచ్‌గా , భోలే జ్యోతిష్యుడిగా , సందీప్ ఓ కిల్లీకొట్టు నడుపుకునే వ్యక్తిగా, అశ్విని అందమైన అమ్మాయిగా, గ్రామంలో రౌడీగా అర్జున్, అతని అనుచరుడిగా ప్రశాంత్ నటించారు. శివాజీకి వయసుకు తగినట్లుగా రెండు వూళ్లకి పెద్దగా నటించారు. ఏ వూరి ప్రజలు గ్రహంతరవాసులను సంతోషపెడతారో, వారికి కెప్టెన్సీ పోటీదారులుగా అవకాశం లభిస్తుంది. ఇక టాస్క్ మొదలయ్యాకే .. ఇంటి సభ్యులు నవ్వులు పూయించారు. ముఖ్యంగా శోభాశెట్టి, తేజల మధ్య వచ్చే సంభాషణలు బాగున్నాయి.
గత కొన్నిరోజులుగా డల్‌గా సాగుతున్న బిగ్‌బాస్ షోకి ఈ టాస్క్ కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. ఆ తర్వాత బిగ్‌బాస్ వీరికి ఎగ్స్ టాస్క్ పెట్టాడు. రెండు జట్ల నుంచి నలుగురేసి చొప్పున పోటీలో పాల్గొనాలి.. ఒక చోట వున్న ఎగ్స్‌ని కిందపడకుండా బ్యాలెన్స్ చేస్తూ ట్రేలో పెట్టాలి. ఇచ్చిన టైం లోగా ఎవరైతే ఎక్కువ ట్రేలో పెడతారో వారే విజేత. ఉత్కంఠభరితంగా సాగిన ఈ టాస్క్‌లో అత్యధికంగా 18 ఎగ్స్‌ని పెట్టి జిలేబీపురం విజయం సాధించింది. చివరిలో పెద్ద మనిషిగా వున్న శివాజీ.. ప్రశాంత్ టీమ్ గెలుస్తుందంటూ చెప్పిన మాటతో సందీప్, అమర్, శోభాశెట్టిలు హర్ట్ అయ్యారు. శోభా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని నిలదీసేసరికి శివాజీ క్షమాపణలు చెప్పాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments