Bigg Boss Telugu 7 : ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం రచ్చ.. ప్రశాంత్‌ , శోభాశెట్టిపై శివాజీ చిందులు.. ఆ టాస్క‌లో విజేత ఎవరు..?

  • IndiaGlitz, [Friday,November 17 2023]

బిగ్‌బాస్ తెలుగులో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోరు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ ఇచ్చే ట్విస్టులకు కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా షాక్‌కు గురవుతున్నారు. టాప్ 10 కంటెస్టెంట్స్‌లో ఆరు నుంచి పది స్థానాల్లో వున్న వారు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీ పడతారని చెప్పిన బిగ్‌బాస్.. ఈ క్రమంలో అర్జున్ గెలిచినప్పటికీ ఇంకో షాకిచ్చాడు. 1 నుంచి 5 స్థానాల్లో వున్న ఓ కంటెస్టెంట్‌తో పోటీ పడాలని ఆదేశించాడు. అంతేకాదు.. వీరిద్దరిలో ఎవరు ఓడినా మరోసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడేందుకు అనర్హులని ప్రకటించాడు. అయినప్పటికీ అర్జున్, యావర్ హోరాహోరీగా తలపడ్డారు. ఫైనల్‌గా ప్రిన్స్ యావర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ దక్కించుకున్నాడు.

బిగ్‌బాస్ రూల్ ప్రకారం.. యావర్ తనతో పోటీ పడాలని పల్లవి ప్రశాంత్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. ఇందులోనూ యావర్ గెలిచాడు. ఆ వెంటనే శోభాశెట్టితో పోరాడి పాస్‌ను కాపాడుకున్నాడు. ఈసారి ఏకంగా శివాజీ, ప్రియాంకలతో పోటీకి దిగాడు. టాస్క్‌లో భాగంగా ఒక విల్లుపై మూడు బాల్స్‌ను బ్యాలెన్స్ చేయాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించాడు. దీనికి శోభా, పల్లవి ప్రశాంత్‌లను సంచాలకులుగా వ్యవహరించాలని చెప్పాడు. కొద్దిసేపు మూడు బాల్స్‌ను బాగానే బ్యాలెన్స్ చేసిన ప్రియాంక.. తర్వాత పట్టుకోల్పోయింది. అయితే శివాజీ రూల్స్‌ను సరిగా పాటించడం లేదంటూ బిగ్‌బాస్ స్వయంగా అనౌన్స్ చేశాడు. మధ్య మధ్యలో పల్లవి ప్రశాంత్ అరుపులు, కేకలే తను డిస్ట్రబ్ చేశాయనే కోపంతో శివాజీ అలిగి వెళ్లిపోయాడు. యావర్ మాత్రం మూడు బాల్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ నిలబడ్డాడు.

టాస్క్ ముగిసిన తర్వాత శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రియాంకలలో విజేత ఎవరో తేల్చాల్సిందిగా శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్‌లను బిగ్‌బాస్ ఆదేశించాడు. శివాజీ రూల్స్ ప్రకారం ఆడలేదని, బాల్స్‌ని చేతితో పట్టుకున్నారని శోభ ఆరోపించింది. దీనికి శివాజీ ఒప్పుకోలేదు.. తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని వాగ్వాదానికి దిగారు. నీ కంటే పెద్దగా అరుస్తానంటూ శివాజీ ఆమె మీదకు వెళ్లాడు. ప్రియాంకకు ఫేవర్‌గా రిజల్ట్ చెప్పేందుకు శోభాశెట్టి ప్రయత్నిస్తోందని ఆయనకు అనుమానం. ఇదే విషయాన్ని ప్రిన్స్ యావర్‌కు కూడా చెప్పాడు. దీంతో అతను కూడా ఫైర్ అయ్యాడు.

ఇవేవి పట్టించుకోకుండా ప్రియాంక, ప్రిన్స్ యావర్‌లలో ఎవరు రూల్స్ ఫాలో అయ్యారని అని శోభాశెట్టి .. ఇతర కంటెస్టెంట్స్‌ని అడిగింది. దీనిపై ఇంటి సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారో తెలియనుంది. మరి తనకు వ్యతిరేకంగా రిజల్ట్ వస్తే శివాజీ ఊరుకుంటాడా.. చూడాలి మరి ఏం జరుగుతుందో.

More News

Naga Chaitanya:మంచి మనసు చాటుకున్న చైతూ.. నెటిజన్ల ప్రశంసలు

అక్కినేని హీరో నాగచైతన్య మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. నవంబర్ 14న జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని

Chandrababu:స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌పై తీర్పు రిజర్వ్

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి.

Rahul Gandhi:రేపు తెలంగాణకు రాహుల్ గాంధీ.. ఒక్కరోజే ఐదు చోట్ల ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

Congress:ప్రజాకర్షణగా కాంగ్రెస్ మేనిఫెస్టో.. పేదలపై వరాల జల్లు..

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా అధికారంలోకి కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లే ప్రచారంలో దూసుకుపోతుంది.

KCR:కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా?.. ప్రజలకు కేసీఆర్ పిలుపు

కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? రైతుబంధు కావాలా? రాబంధు కావాలా? సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.