శివ కందుకూరి హీరోగా పి19 ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
శివ కందుకూరి హీరోగా పి19 ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై యువ వ్యాపారవేత్త సురేష్ రెడ్డి కొవ్వూరి ఓ సినిమా నిర్మిస్తున్నారు. పి19లో ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ద్వారా చవన్ ప్రసాద్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. జూన్ నెల నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ "శివ కందుకూరి పాత్ర సినిమా మెయిన్ పిల్లర్స్ లో ఒకటి. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో అతను కనిపిస్తారు. సీతారామ్ ప్రసాద్ మంచి కథ చెప్పారు. దానికి చవన్ ప్రసాద్ న్యాయం చేయగలుగుతారని అతడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఈ సినిమాకు 'జాతిరత్నాలు' ఫేమ్ సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. 'క్షణం', 'గూఢచారి', 'ఎవరు', 'హిట్', 'కృష్ణ అండ్ హిజ్ లీల' తదితర హిట్ సినిమాలకు ఎడిటింగ్ చేసిన గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ చేయనున్నారు. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. మంచి టెక్నికల్ టీమ్ కుదిరింది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. జూన్ నెల నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. కొడైకెనాల్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం" అని అన్నారు.
శివ కందుకూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ పార్ట్‌నర్: టికెట్ ఫ్యాక్టరీ, కథ: సీతారామ్ ప్రసాద్, ఛాయాగ్రహణం: సిద్ధం మనోహర్ (జాతిరత్నాలు), కూర్పు: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, ప్రొడక్షన్ కంట్రోలర్: సాయిబాబు వాసిరెడ్డి, దర్శకత్వం: చవన్ ప్రసాద్, నిర్మాణ సంస్థ: పి19 ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పి, సహ నిర్మాత: నభిషేక్, నిర్మాత: సురేష్ రెడ్డి కొవ్వూరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments