దసరా కానుకగా 'శివ గంగ'
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీరామ్, రాయ్‌లక్ష్మీ, సుమన్, మనోబాల, వడివక్కరసి ముఖ్యపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం 'శివగంగ'. కుమార్‌బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్ బ్యానర్‌పై వి.సి.ఉదయన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కె.శివనాథ్, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. 'అరుంధతి', 'కాంచన', 'చంద్రముఖి', 'గంగ', 'చంద్రకళ' చిత్రాల తరహాలో ఈ సినిమా హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. తెలుగు, తమిళంలో విడుదలకు సన్నాహాలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా...
చిత్ర సమర్పకులు కుమార్ బాబు మాట్లాడుతూ ''ప్రస్తుతం తెలుగు, తమిళంలో హర్రర్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా మా 'శివ గంగ' చిత్రం కూడా హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో సినిమాని రూపొందిస్తున్నాం. అన్నీ కమర్షియల్ హంగులతో, ఉహించని ట్విస్ట్‌లతో సినిమా సాగుతుంది. రెండు ఆత్మల ప్రతీకారం తీర్చుకోవడమనే కాన్సెప్ట్‌తో సినిమా సాగుతుంది. తెలుగు, తమిళ ప్రేక్షకకులకు సుపరిచితుడైన నటుడు శ్రీరామ్ ఇందులో శివ, శక్తి అనే రెండు రోల్స్‌ను పోషిస్తున్నాడు. అలాగే రాయ్‌లక్ష్మీ కూడా గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్తో సత్తా చాటనుంది. 37 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్ అవుతాయి. సీనియర్ నటుడు సుమన్ నెగటివ్ రోల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో భాగంగా డబ్బింగ్, రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని దసరా కానుకగా రెండు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
నిర్మాతలు కె.శివనాథ్, మారెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ''మా సంస్థ నుండి తొలి చిత్రంగా రానున్న భారీ బడ్జెట్ మూవీ 'శివ గంగ'. హర్రర్ , యాక్షన్ విత్ ఎంటర్టైన్మెంట్తో ఈ మూవీ రూపొందుతోంది. డైరెక్టర్ వి.సి.ఉదయన్ సినిమాని ఎక్సలెంట్‌గా తెరకెక్కిస్తున్నారు. హై టెక్నికల్ వాల్యూస్ ఉన్న చిత్రం. కనల్ కణ్ణన్ ఫైట్స్, జాన్ పీటర్ మ్యూజిక్, వి.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. త్వరలోనే ఆడియో విడుదల చేసి, దసరా కానుకగా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout