బిగ్‌బాస్ విజేత‌గా శివ‌బాలాజీ...

  • IndiaGlitz, [Monday,September 25 2017]

బుల్లితెర సెన్సేష‌నల్ అంటూ ప్రారంభమైన రియాలిటీ షో బిగ్‌బాస్‌. హిందీ వెర్ష‌న్‌కు అనుగుణంగా తెలుగులో కూడా స్టార్ మా ఈ ప్రోగ్రామ్‌ను నిర్వ‌హించింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం. అందులో భాగంగా తెలుగులో జ‌రిగిన ఈ రియాలిటీ షోలో ఫైన‌ల్‌కు హ‌రితేజ‌, న‌వ‌దీప్‌, అర్చ‌న‌, ఆద‌ర్శ‌, శివ‌బాలాజీ చేరుకున్నారు. అయితే ఫైన‌ల్‌గా విజ‌యం శివ బాలాజీనే వ‌రించింది.

3.35 కోట్ల వోట్ల‌తో శివ బాలాజీ నెగ్గ‌డం విశేషం. ఆద‌ర్శ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచారు. విజేత‌గా నిలిచిన శివ బాలాజీకి 50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీని అందించారు. 71 రోజుల పాటు షోను నిర్వ‌హించారు. వారాల‌బ్బాయి అనే పేరు వినేవాడిని. ఇప్పుడు నేను కూడా వారం వారం వ‌చ్చి బిగ్‌బాస్‌, స‌భ్యులు, ప్రేక్ష‌కుల‌తో వినోదం పంచుకునేవాడిని. ఇది నాకు ఎమోష‌న‌ల్ జ‌ర్నీ అని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు.