శివబాలాజీ, అజయ్ ప్రధానపాత్రల్లో సెప్టెంబర్ 23 నుండి రెగ్యులర్ షూటింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇది అశోక్‌గాడి లవ్‌స్టోరీ` సినిమాతో తెరంగేట్రం చేసి ఆర్య, సంక్రాంతి, పోతేపోనీ, చందమామ, శంభో శివ` శంభో వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల వద్ద తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివ బాలాజీ. విలక్షణమైన పాత్రల్లో నటించిన శివబాలాజీ ఇప్పుడు యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే తలంపుతో నిర్మాతగా మారారు. గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ అనే బ్యానర్ ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా పడ్డానండీ ప్రేమలో మరి` వంటి క్యూట్ లవ్ స్టోరీని రూపొందించిన దర్శకుడు మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో ఓ సినిమాని రూపొందిస్తున్నారు. రేపటి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
ఈ సందర్భంగా నటుడు, నిర్మాత శివబాలాజీ మాట్లాడుతూ ''యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే తలంపుతో నిర్మాతగా మారాను. మా అబ్బాయి పేరుపై గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ అనే బ్యానర్‌ను స్టార్ట్ చేశాను. ఈ బ్యానర్లో తొలి చిత్రం రేపటి(సెప్టెంబర్ 23) నుండి రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకుంటుంది. ఒక నటుడుగా నేను సినిమా ఇండస్ట్రీలోకి 2002, సెప్టెంబర్ 23న ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు నిర్మాతగా నేను చేస్తున్న సినిమా సెప్టెంబర్ 23న స్టార్ట్ అవుతుండటం ఆనందంగా ఉంది.
ఈ సందర్భంగా నన్ను ఆదరించిన ప్రేక్షకులు, దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమాలో ప్రముఖ నటుడు అజయ్ ప్రధానపాత్రలో నటిస్తున్నారు.మహేష్ ఉప్పుటూరి దర్శకుడు.అలాగే భరణి కె.ధరణ్, సునీల్ కశ్యప్ వంటి మంచి యంగ్ టీమ్ కుదిరింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తోరూపొందనున్న ఈ చిత్రం 1980 బ్యాక్ డ్రాప్ పై, ఓ నిజ ఘటన ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఇద్దరి స్నేహితుల కథ. ప్రేక్షకులు కోరుకునే అన్నీ ఎలిమెంట్స్ తో సినిమా ఉంటుంది'' అన్నారు.
శివబాలాజీ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: ధన్ విన్, కెమెరా: భరణి కె.ధరణ్, మ్యూజిక్: సునీల్ కశ్యప్; నిర్మాత: శివబాలాజీ మనోహరన్, దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments