50:50పై తగ్గే ప్రసక్తే లేదంటున్న శివసేన.. బీజేపీ ఏం చేస్తుందో!?
Send us your feedback to audioarticles@vaarta.com
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా బీజేపీ-శివసేన ఇంకా కొలిక్కిరాలేదు. సీఎం పదవి ఇచ్చితీరాల్సిందేనని శివసేన పట్టువీడట్లేదు. వాస్తవానికి ఇరు పార్టీల మధ్య 50:50 ఒప్పందం ఉందని ఇది ఎన్నికలకు ముందే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించామని ఇదివరకే ఉద్దవ్ థాక్రే ఇదివరకే చెప్పిన విషయం విదితమే.
అందుకే ఈ 50:50 పై తాడో పేడో తేల్చుకోవాలని ఉద్దవ్.. అమిత్ షాను ఈ నెల 30న కలవాలని నిర్ణయించారు. అయితే రేపు జరగాల్సిన ఈ భేటీ రద్దయ్యింది. ఈ క్రమంలో షా తమకు ఇచ్చిన హామీకి తూట్లు పొడిచారని శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హామీ నెరవేర్చలేని పక్షంలో.. హామీలకు విలువ ఇవ్వనప్పుడు వారితో ఎందుకు చర్చలు జరపాలి..? అని ఉద్దవ్ భావించారని సంజయ్ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. అందుకే తాము చర్చలు రద్దు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే.. తానే సీఎంను అని.. సీఎం పదవిని చెరిసగం పంచుకోవాల్సిన అవసరం తమకు లేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చెపపుకొచ్చారు. అసలు తాము అలాంటి హామీ ఏమీ ఇవ్వలేదని.. 50:50 ఫార్మూలానే చర్చకు రాలేదన్నారు. ఫడ్నవిస్ వ్యాఖ్యలతో నొచ్చుకున్న ఉద్దవ్.. ఈక్రమంలో షాతో చర్చలు రద్దు చేసుకున్నారని దీన్ని బట్టి చేస్తే స్పష్టంగా అర్థమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments