50:50పై తగ్గే ప్రసక్తే లేదంటున్న శివసేన.. బీజేపీ ఏం చేస్తుందో!?

  • IndiaGlitz, [Tuesday,October 29 2019]

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా బీజేపీ-శివసేన ఇంకా కొలిక్కిరాలేదు. సీఎం పదవి ఇచ్చితీరాల్సిందేనని శివసేన పట్టువీడట్లేదు. వాస్తవానికి ఇరు పార్టీల మధ్య 50:50 ఒప్పందం ఉందని ఇది ఎన్నికలకు ముందే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించామని ఇదివరకే ఉద్దవ్ థాక్రే ఇదివరకే చెప్పిన విషయం విదితమే.

అందుకే ఈ 50:50 పై తాడో పేడో తేల్చుకోవాలని ఉద్దవ్.. అమిత్ షాను ఈ నెల 30న కలవాలని నిర్ణయించారు. అయితే రేపు జరగాల్సిన ఈ భేటీ రద్దయ్యింది. ఈ క్రమంలో షా తమకు ఇచ్చిన హామీకి తూట్లు పొడిచారని శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హామీ నెరవేర్చలేని పక్షంలో.. హామీలకు విలువ ఇవ్వనప్పుడు వారితో ఎందుకు చర్చలు జరపాలి..? అని ఉద్దవ్ భావించారని సంజయ్ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. అందుకే తాము చర్చలు రద్దు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే.. తానే సీఎంను అని.. సీఎం పదవిని చెరిసగం పంచుకోవాల్సిన అవసరం తమకు లేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చెపపుకొచ్చారు. అసలు తాము అలాంటి హామీ ఏమీ ఇవ్వలేదని.. 50:50 ఫార్మూలానే చర్చకు రాలేదన్నారు. ఫడ్నవిస్ వ్యాఖ్యలతో నొచ్చుకున్న ఉద్దవ్.. ఈక్రమంలో షాతో చర్చలు రద్దు చేసుకున్నారని దీన్ని బట్టి చేస్తే స్పష్టంగా అర్థమవుతోంది.

More News

క్రిస్మ‌స్ బ‌రిలో రాజ్‌త‌రుణ్

ఉయ్యాల‌జంపాలా, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్ చిత్రాల‌తో వ‌రుస స‌క్సెస్‌ల‌ను సొంతం చేసుకున్న యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్‌కి త‌ర్వాత ఎందుక‌నో ఆశించిన స్థాయిలో స‌క్సెస్‌లు మాత్రం ద‌క్క‌లేదు.

నవంబర్ 13న లవర్‌తో నటి అర్చన పెళ్లి

2004లో ‘నేను’ సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది.

బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అటకెక్కిన ‘ఐకాన్’!

టాలీవుడ్ యంగ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హేగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో..’ ఈ చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.

తిల‌కం పెట్టుకున్న షారూక్.. ట్రోల్ చేశారు

బాలీవుడ్ బాద్‌షా.. ఖాన్ త్రయాల్లో ఒక‌రైన షారూక్‌ఖాన్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. దీపావ‌ళి సంద‌ర్భంగా షారూక్ త‌న అభిమానుల‌కు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తుంటాడు.

'టీడీపీని చంద్రబాబు గొంతు పిసికి చంపేస్తున్నారు'

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు.. సొంత పార్టీని గొంతు పిసికి చంపేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన వైసీపీ సభలో ఆయన ప్రసంగిస్తూ..