శ్రియకు మరో అవకాశం ఇచ్చిన బాలయ్య..!
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రంలో వాశిష్టి దేవిగా, శాతకర్ణి భార్యగా అందాల తార శ్రియ నటించింది. వాశిష్టి దేవి పాత్రలో శ్రియ నటన చూస్తుంటే...ఎక్కడా నటిస్తున్నట్టు అనిపించలేదు...అంతలా ఆ పాత్రలో లీనమై నటించింది. బాలకృష్ణ, క్రిష్ తో పాటు సినిమా చూసిన ప్రతి ఒక్కరు శ్రియ నటనను అభినందించకుండా ఉండలేరు.
ఇక అసలు విషయానికి వస్తే...బాలయ్య 101 వ చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమా చేయనున్నారు అనే విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను అమితాబ్ తో చేయించాలని ప్రయత్నిస్తున్నారు. అమితాబ్ చేయకపోతే ఈ సినిమానే ఉండదు అని బాలయ్య చెప్పారు. 101వ సినిమాగా ఏ సినిమా చేసినా అందులో హీరోయిన్ మాత్రం శ్రియ అని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో శ్రియ అద్భుతంగా నటించడంతో తదుపరి చిత్రంలో కూడా అవకాశం ఇస్తాను అని శ్రియకు బాలయ్య మాట ఇచ్చారట. అది సంగతి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments