శ్రియకు మరో అవకాశం ఇచ్చిన బాలయ్య..!

  • IndiaGlitz, [Monday,January 16 2017]

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రంలో వాశిష్టి దేవిగా, శాత‌క‌ర్ణి భార్య‌గా అందాల తార శ్రియ న‌టించింది. వాశిష్టి దేవి పాత్ర‌లో శ్రియ న‌ట‌న చూస్తుంటే...ఎక్క‌డా న‌టిస్తున్న‌ట్టు అనిపించ‌లేదు...అంత‌లా ఆ పాత్ర‌లో లీన‌మై న‌టించింది. బాల‌కృష్ణ‌, క్రిష్ తో పాటు సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రు శ్రియ న‌ట‌న‌ను అభినందించ‌కుండా ఉండ‌లేరు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...బాల‌య్య 101 వ చిత్రం కోసం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రైతు సినిమా చేయ‌నున్నారు అనే విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ను అమితాబ్ తో చేయించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. అమితాబ్ చేయ‌క‌పోతే ఈ సినిమానే ఉండ‌దు అని బాల‌య్య చెప్పారు. 101వ సినిమాగా ఏ సినిమా చేసినా అందులో హీరోయిన్ మాత్రం శ్రియ అని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఎందుకంటే గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రంలో శ్రియ అద్భుతంగా న‌టించ‌డంతో త‌దుప‌రి చిత్రంలో కూడా అవ‌కాశం ఇస్తాను అని శ్రియకు బాల‌య్య మాట ఇచ్చార‌ట‌. అది సంగ‌తి..!

More News

.....తెలుసుకోకుండా సినిమా తీసేంత పిచ్చివాడిని కాదు నేను - క్రిష్

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చారిత్రాత్మక చిత్రాన్ని జాగర్లమూడి క్రిష్ తెరకెక్కించారు.

వెంకీ - క్రిష్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..!

గమ్యం, వేదం, కృష్ణం వందేజగద్గురుమ్, కంచె, తాజాగా బాలయ్య 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని తెరకెక్కించిన విభిన్న కథా చిత్రాల దర్శకుడు జాగర్లమూడి క్రిష్.

'నాన్న కూచి' అంటున్న నిహారిక

ఒక మనసు చిత్రంతో మెగాఫ్యామిలీ నుండి వచ్చిన హీరోయిన్ నిహారిక కొణిదెల.., సినిమాల్లోకి రాక మునుపే ముద్దపప్పు అవకాయ్ అనే వెబ్ సిరీస్ తో అందరికీ దగ్గరైంది.

ఎన్టీఆర్ సినిమాకు బాలీవుడ్ కెమెరామెన్

జనతాగ్యారేజ్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ వెంటనే సినిమా చేయకుండా చాలా గ్యాప్ తీసుకున్నాడు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో అన్న కల్యాణ్రామ్ నిర్మాతగా తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు.

సాహో ఎన్.బి.కెః ఎన్టీఆర్

నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో, బాలకృష్ణ నటించిన 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`.