Shirdi:సాయి భక్తులకు అలర్ట్ .. షిర్డీలో మే 1 నుంచి నిరవధిక బంద్, ఎందుకంటే..?

  • IndiaGlitz, [Friday,April 28 2023]

షిర్డీ సాయి భక్తులకు షాకింగ్ న్యూస్. షిర్డీ గ్రామస్తులు మే 1 నుంచి నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే.. షిర్డీ సాయిబాబా ఆలయానికి మరింత భద్రత కల్పించాలన్న సాయి సంస్థాన్ ట్రస్ట్, మహారాష్ట్ర పోలీసుల నిర్ణయాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఆలయ భద్రతా ఏర్పాట్లను సాయి సంస్థాన్ సిబ్బంది పర్యవేక్షిస్తుండగా.. ఆలయ ప్రాంగణంలో భద్రతను మాత్రం మహారాష్ట్ర పోలీసులు చూస్తున్నారు.

సీఐఎస్ఎఫ్ భద్రత కావాలన్న షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ :

ఇదిలావుండగా.. సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో ఆలయ భద్రతపై బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సాయి సంస్థాన్ ట్రస్ట్ అభిప్రాయం కోరగా.. సీఐఎస్ఎఫ్ భద్రతకు ఆలయ ట్రస్ట్ అంగీకరించింది. అయితే దీనిని షిర్డీ గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనితో పాటు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలని.. ప్రభుత్వానికి చెందిన డిప్యూటీ కలెక్టర్, ప్రాంతీయ అధికారి, తహసీల్దార్ అధికారితో కమిటీ వుండాలని గ్రామస్తులు కోరుతున్నారు.

భక్తులకు ఇబ్బందులు వుండవన్న షిర్డీ ట్రస్ట్:

బంద్‌పై షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ స్పందించింది. దర్శనాలపై ఎలాంటి ప్రభావం వుండదని.. ఆలయ పరిధిలోని అన్ని నివాసాలు, ధర్మశాల, రెస్టారెంట్, ఆసుపత్రి అన్ని తెరచి వుంటాయని.. ఆలయానికి వెళ్లే బస్సులు యథాతథంగా నడుస్తాయని .. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు వుండవని పేర్కొంది.

More News

RC16:చరణ్- బుచ్చిబాబు మూవీ .. అది కోడి రామ్మూర్తి బయోపిక్ కాదు, క్లారిటీ ఇచ్చిన చెర్రీ టీమ్

టాలీవుడ్‌లో దర్శకుల పరిస్ధితి విచిత్రంగా వుంటుంది. సాధారణంగా ఫ్లాప్‌లు ఇచ్చిన దర్శకులకు మరో ఆఫర్ రావడం కష్టం.

Producer Abhishek Agarwal:నిర్మాతలను గౌరవించేది ఇలాగేనా.. ఫిల్మ్ ఫేర్ నిర్వాహకులపై ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ఆగ్రహం

68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలు వివాదాస్పదమవుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కగా..

Weather Forecast : మరో ఆరు రోజులు వానలే వానలు .. తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్

భానుడి భగభగలతో దేశం మొత్తం అల్లాడుతుంటే తెలంగాణలో మాత్రం విచిత్ర వాతావరణం నెలకొంది.

Telangana Secretariat:తెలంగాణ కొత్త సచివాలయం ఓపెనింగ్.. ఫ్లోర్‌ల వారీగా శాఖల కేటాయింపు, కేసీఆర్ ఆఫీస్ ఎక్కడ..?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైన సంగతి తెలిసిందే.

Mahesh Babu : అనసూయ 'ప్రేమ విమానం' కు మహేశ్ సపోర్ట్.. టీజర్ అదిరిపోయిందిగా

రావణాసుర, గూఢచారి వంటి భారీ బడ్జెట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ పిక్చర్స్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్స్‌ను కూడా నిర్మిస్తోంది.