Shirdi:సాయి భక్తులకు అలర్ట్ .. షిర్డీలో మే 1 నుంచి నిరవధిక బంద్, ఎందుకంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
షిర్డీ సాయి భక్తులకు షాకింగ్ న్యూస్. షిర్డీ గ్రామస్తులు మే 1 నుంచి నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే.. షిర్డీ సాయిబాబా ఆలయానికి మరింత భద్రత కల్పించాలన్న సాయి సంస్థాన్ ట్రస్ట్, మహారాష్ట్ర పోలీసుల నిర్ణయాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఆలయ భద్రతా ఏర్పాట్లను సాయి సంస్థాన్ సిబ్బంది పర్యవేక్షిస్తుండగా.. ఆలయ ప్రాంగణంలో భద్రతను మాత్రం మహారాష్ట్ర పోలీసులు చూస్తున్నారు.
సీఐఎస్ఎఫ్ భద్రత కావాలన్న షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ :
ఇదిలావుండగా.. సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో ఆలయ భద్రతపై బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సాయి సంస్థాన్ ట్రస్ట్ అభిప్రాయం కోరగా.. సీఐఎస్ఎఫ్ భద్రతకు ఆలయ ట్రస్ట్ అంగీకరించింది. అయితే దీనిని షిర్డీ గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనితో పాటు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలని.. ప్రభుత్వానికి చెందిన డిప్యూటీ కలెక్టర్, ప్రాంతీయ అధికారి, తహసీల్దార్ అధికారితో కమిటీ వుండాలని గ్రామస్తులు కోరుతున్నారు.
భక్తులకు ఇబ్బందులు వుండవన్న షిర్డీ ట్రస్ట్:
బంద్‌పై షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ స్పందించింది. దర్శనాలపై ఎలాంటి ప్రభావం వుండదని.. ఆలయ పరిధిలోని అన్ని నివాసాలు, ధర్మశాల, రెస్టారెంట్, ఆసుపత్రి అన్ని తెరచి వుంటాయని.. ఆలయానికి వెళ్లే బస్సులు యథాతథంగా నడుస్తాయని .. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు వుండవని పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com