15 ఏళ్ల నాటి ‘‘ముద్దు’’ కేసు.. శిల్పా శెట్టికి కోర్టులో ఊరట
Send us your feedback to audioarticles@vaarta.com
బహిరంగ ముద్దు కేసు నుంచి బాలీవుడ్ సీనియర్ నటి శిల్పా శెట్టికి కోర్టులో భారీ ఊరట లభించింది. పదిహేనేళ్ల నాటి ఈ కేసును విచారించిన న్యాయస్థానం శిల్పా శెట్టి బాధితురాలిగా తేల్చింది. 2007లో రాజస్తాన్‌లోని ఓ కార్యక్రమానికి హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి హాజరయ్యారు.
ఈ క్రమంలో వేదికపై ఉన్న రిచర్డ్.. ఒక్కసారిగా శిల్పాపై ముద్దుల వర్షం కురిపించాడు. ఒక మహిళగా దీనిని శిల్పాశెట్టి అడ్డుకోలేదన్నది ప్రధాన ఆరోపణ. ప్రజలు, ప్రముఖులు అందరూ చూస్తుండగానే బహిరంగంగానే ముద్దులు పెట్టుకుంటూ అనుచితంగా ప్రవర్తించారంటూ వీరిద్దరిపై కేసులు నమోదయ్యాయి. తొలుత రాజస్థాన్‌లో నమోదైన ఈ కేసులను శిల్పా అభ్యర్థన మేరకు ముంబై మెట్రోపాలిటన్ కోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో బుధవారం ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం శిల్పా శెట్టి నిందితురాలు కాదని ఆమె బాధితురాలని పేర్కొంటూ కేసును కొట్టిపారేసింది.
కాగా.. శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జూలై 19, 2021న అరెస్టయిన రాజ్ కుంద్రా సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినిమాల్లో అవకాశాల పేరుతో యువతులకు ఆశ పెట్టి.. కుంద్రా అండ్ గ్యాంగ్ ఈ రొంపిలోకి దింపినట్లు పోలీసులు తేల్చారు. హిందీ పరిశ్రమలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్‌ను టార్గెట్‌గా చేసుకుని వారిని పోర్న్ వీడియోల్లో నటించమని ఒత్తిడి చేస్తున్నట్లు నిరూపితమవడంతో రాజ్ కుంద్రాతో పాటు మరో 11 మందిని అరెస్ట్ చెయ్యడంతో పాటు అప్పట్లోనే రూ. 7.5 కోట్లను సీజ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout