భర్తతో శిల్పాశెట్టి వార్.. పోర్న్ కాదంటూ పోలీసుల ఎదుట కంటతడి!
Send us your feedback to audioarticles@vaarta.com
తన ప్రమేయం లేకుండానే బాలీవుడ్ నటి శిల్పా శెట్టి వార్తల్లో కెక్కింది. ఇందంతా ఆమె భర్త రాజ్ కుంద్రా పుణ్యమే. పోర్న్ చిత్రాల మేకింగ్ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కానీ రాజ్ కుంద్రా, అతడి సన్నిహితుల వాదన మాత్రం వేరేలా ఉంది. ఆయనని యాప్స్ కోసం బోల్డ్ కంటెంట్ తో వెబ్ సిరీస్ లు చేస్తున్నది నిజమే అని.. కాకపోతే అవి పోర్న్ చిత్రాలు కావని, ఎరోటిక్ ఫిలిమ్స్ అని అంటున్నారు.
ఇదీ చదవండి: హాట్ ఫోటోస్: ప్రగ్యా జైశ్వాల్ బోల్డ్ షో నెవ్వర్ బిఫోర్!
ఈ మొత్తం వ్యవహారంలో శిల్పా శెట్టి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. దీనితో మానసిక వేదనతో శిల్పా శెట్టి ఇటీవల తనకు కష్టాలు కొత్త కాదని స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మీడియాలో వస్తున్నకథనాల మేరకు శిల్పా శెట్టి తన భర్తపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
విచారణ కోసం రాజ్ కుంద్రా ఇంటికి వచ్చిన సమయంలో శిల్పా శెట్టి అతడితో వాగ్వాదానికి దిగినట్లు టాక్. ఈ మొత్తం ఎపిసోడ్ లో తన ఇమేజ్ డ్యామేజ్ అయిందని, కొన్ని డీల్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయని శిల్పా శెట్టి పోలిసుల ముందుకంటతడి పెట్టుకుందట. ఆర్థికంగా చాలా నష్టపోయానని శిల్పా శెట్టి పేర్కొన్నట్లు తెలుస్తోంది. కానీ తన భర్తకు వ్యతిరేకంగా పోలీసులతో ఎలాంటి విషయాలు చెప్పలేదని పైగా వేనేసుకువచ్చినట్లు సమాచారం.
తన భర్త రాజ్ కుంద్రా నిర్మిస్తున్నవి పోర్న్ కాదని అవి ఎరోటిక్ బోల్డ్ ఫిలిమ్స్ అని పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. తన భర్త డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో శృంగార భరిత చిత్రాలు చేస్తారని వాటిని పోర్న్ అనుకోవద్దని వాంగ్మూలం ఇచ్చిందట. కానీ హాట్ షాట్స్ లో వచ్చే కంటెంట్ పై తనకు అవగాహన లేనట్లు శిల్పా శెట్టి పేర్కొంది.
ముంబై మేజిస్ట్రేట్ కోర్టు రాజ్ కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించింది. రాజ్ కుంద్రా నుంచి పోలీసులు దాదాపు 48 టెరాబైట్స్ అస్లీల కంటెంట్ ని స్వాధీనం చేసుకున్నారట. అందులో వీడియోలతో పాటు ఫొటోస్ కూడా ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments