బన్నీ బుట్టు బొమ్మ సాంగ్‌కు శిల్పా శెట్టి డ్యాన్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’ అంచనాలకు మించి ఆడిన సంగతి తెలిసిందే. ఊహించిన దానికంటే గట్టిగానే కలెక్షన్ల వర్షం సైతం కురిసింది. ఈ సినిమాకు సంబంధించి పాటల రిలీజ్ మొదలుకుని సినిమా విడుదలై ఇన్ని రోజులవుతున్నా.. అటు నెట్టింట్లో.. ఇటు యూట్యూబ్‌లో మరీ ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో రింగ్ టోన్స్, పాటలు మార్మోగుతున్నాయి.
ఈ మూడే...!
పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఈ పాటలకు డ్యాన్స్ వేస్తున్నారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో ‘సామజవరగమణ’, ‘రాములో రాములా..’, ‘బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే’ ఈ మూడు పాటలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి. ఈ పాటను తమన్ తనదైన శైలిలో సంగీతం అందించగా.. ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు. అర్మాన్ మాలిక్ ఆలపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
దుమ్ము లేపిన శిల్పా!
ఈ పాట ఇప్పుడు టిక్‌టాక్‌తో మరింత ఫేమస్ అయ్యింది. తమిళనాడు, కేరళ, బెంగాలీ భాషల్లో ఈ సాంగ్‌ను చాలా మంది టిక్ టాక్ చేశారు. తాజాగా.. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్‌ను టిక్ టాక్ చేసి చేసింది. అటు ఇటు నడుము తిప్పుతూ.. చేతులు తిప్పుతూ శిల్పా దుమ్ములేపింది. దీన్ని బట్టి చేస్తే సాంగ్ ఎంతటి పావులర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. కాగా.. ఇప్పటి వరకూ బుట్టబొమ్మ సాంగ్‌కి టిక్ టాక్‌లో దాదాపు 4.6 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఈ వీడియోపై ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు కామెంట్లు, లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.
@theshilpashetty Bhutta Booma Shilpa Shetty Style ?? #bhuttabooma #telegu #lovedanceing #dancewithshilpa #duetwithme #fyp
♬ original sound - SwAmy PriyAzz??
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com