బిగ్‌బాస్ నుండి శిల్పా ఎలిమినేట్‌

  • IndiaGlitz, [Monday,September 16 2019]

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజ‌న్ స్టార్‌మాలో ప్ర‌సారం అవుతుంది. ఈ సీజ‌న్‌కు మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో ఇప్ప‌టి వ‌ర‌కు 8 వారాల‌ను పూర్తి చేసుకుంది. 7 ఎలిమినేష‌న్స్ జ‌రిగాయి. హేమ‌, రోహిణి, తమ‌న్నా సింహాద్రి, అన్షు, అలీరెజాలు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం యాంక‌ర్ శిల్పా చ‌క్ర‌వ‌ర్తి ఎలిమినేట్ అయ్యారు.

రెండు వారాల ముందు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన యాంక‌ర్ శిల్పా చ‌క్ర‌వ‌ర్తి ఇలా వ‌చ్చి అలా ఎలిమినేట్ అయ్యింది. గ‌త వారం ఆమెకు తొలి వారం కాబ‌ట్టి ఎలిమినేష‌న్ ప్రాసెస్‌కు దూరంగా పెట్టారు. అయితే ఈ సారి మాత్రం ఎలిమినేష‌న్ నుండి శిల్పా త‌ప్పించుకోలేక‌పోయింది. శ్రీముఖి, హిమ‌జ‌, మ‌హేశ్‌, శిల్పా చ‌క్ర‌వ‌ర్తి, పున‌ర్న‌వి ఎలిమినేష‌న్‌లో పాల్గొన్నారు. వీరందరిలో శిల్పా చ‌క్ర‌వ‌ర్తికే త‌క్కువ ఓట్లు రావ‌డంతో ఆమెను ఎలిమినేట్ చేస్తున్న‌ట్లు నాగార్జున ప్ర‌క‌టించారు.

శిల్పా చ‌క్ర‌వ‌ర్తి ఎలిమినేట్ కాబోతున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌లు మ‌రోసారి నిజం అయ్యాయి. బిగ్‌బాస్ హౌస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన శిల్పా చ‌క్ర‌వ‌ర్తి త‌న హౌస్‌మేట్స్ గురించి చెబుతూ, మ‌హేశ్‌ని తిక్క‌లోడు అని, శివ‌జ్యోతిని అందాల‌రాక్ష‌సి అని, రాహుల్‌ని కోపిష్టి అని, ర‌వి మొండోడు అని, పున‌ర్న‌విని మూర్ఖురాల‌ని, వితికాని గ‌య్యాలి అని, హిమ‌జ‌ని అహంకారి అని, బాబా భాస్క‌ర్ జిత్తుల మారి న‌క్క అని, శ్రీముఖిని అవ‌కాశ‌వాది అని చెప్పింది.

More News

గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసిన 'డిస్కోరాజా'

మాస్ మ‌హారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘డిస్కోరాజా’. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై

‘పల్నాటి పులి’ కోడెల కన్నుమూత.. ట్విస్ట్ ఏంటంటే..! 

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ కీలక నేత, రాజకీయ ఉద్ధండుడిగా పేరుగాంచిన కోడెల శివప్రసాద్ (72) ఆత్మహత్య చేసుకున్నారు.

20 ఏళ్లయినా చావలేదు.. రెండు టెర్మ్‌లు నేనే సీఎం!!

తెలంగాణ అసెంబ్లీలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారం దక్కించుకున్న తర్వాత సీఎంగా కేసీఆర్ కొన్ని రోజులు మాత్రమే కొనసాగుతారని..

గోదారిలో ఘోర బోటు ప్రమాదం.. 254 అడుగుల లోతులో..!

తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. 54 మందితో పాపికొండలు నుంచి బయల్దేరిన టూరిజం బోటు బయలుదేరింది.

యురేనియం తవ్వకాలపై అసెంబ్లీ కేటీఆర్ ప్రకటన!

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు గాను రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి అనుమతినిచ్చాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.