బలవంతంగా ముద్దులు పెట్టాడు..పెళ్ళైన వ్యక్తితో సంబంధం పెట్టుకోను
Send us your feedback to audioarticles@vaarta.com
పోర్న్ చిత్రాల వివాదంలో రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ముంబై క్రైబర్ క్రైమ్ పోలీసులు క్రమపద్ధతిలో విచారణ జరుపుతూ ఒక్కో విషయం కూపీ లాగుతున్నారు. రాజ్ కుంద్రాతో చర్చలు జరిగిపిన శృంగార తార షెర్లిన్ చోప్రాని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ముంబై పోలిసుల ఎదుట తనకు, రాజ్ కుంద్రా మధ్య జరిగిన సంఘటనలని షెర్లిన్ చోప్రా పూర్తిగా బయట పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అరవీర భయంకరుడు అధీరా.. కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ లేటెస్ట్ లుక్
కొన్ని నెలల క్రితం షెర్లిన్ చోప్రా.. రాజ్ కుంద్రాపై నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసు గురించి పోలీసులు ఆమెని ప్రశ్నించారు. ఏప్రిల్ లో షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రా తనని లైంగికంగా వేధించినట్లు తెలిపింది. 2019 ప్రారంభంలో రాజ్ కుంద్రా తన మేనేజర్ ని ఇలిచాడు. ఓ బిజినెస్ విషయం మాట్లాడేందుకు నా మేనేజర్ ని కుంద్రా కలిశారు.
ఆ సమయంలో మా మధ్య చాట్ జరిగింది. కానీ రాజ్ కుంద్రా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నా ఇంటికి వచ్చేశాడు. బలవంతంగా నాకు ముద్దులు పెట్టడం ప్రారంభించాడు. నేను తప్పించుకునేందుకు ప్రయత్నించినా వదల్లేదు. పెళ్ళైన వ్యక్తితో నేను సంబంధం పెట్టుకోను.. డబ్బు కోసం ఇలాంటి పనులు చేయను అని చెప్పాను.
శిల్పా శెట్టితో తన రిలేషన్ షిప్ బాగాలేదని.. ఇంట్లో ఉన్నంతసేపు తీవ్ర మానసిక ఒత్తిడి నెలకొని ఉందని.. అందుకే ఇక్కడకి వచ్చినట్లు చెప్పాడు. కానీ నేను మాత్రం అతడి నుంచి తప్పించుకునేందుకే ప్రయత్నించా. బలవంతగా అతడిని నెట్టేసి వాష్ రూమ్ కి వెళ్ళిపోయా అని షెర్లిన్ పోలీసులకు వివరించింది.
ఇక తాను సోషల్ మీడియాలో చేస్తున్న వీడియోల గురించి కూడా రాజ్ కుంద్రా గతంలో నాతో చర్చించాడు. సోషల్ మీడియాలో నువ్వు ఫ్రీగా వీడియోలు అప్లోడ్ చేస్తున్నావు.నాతో చేతులు కలిపితే డబ్బు వచ్చేలా చేస్తా అని చెప్పాడు. కానీ ఆ డీల్ నాకు నచ్చలేదు. అలాగే హాట్ షాట్స్ యాప్ లో కంటెంట్ కోసం కూడా నన్ను అడిగారు. అందులో కంటెంట్ దారుణంగా ఉండడంతో దానికి కూడా నేను అంగీకరించలేదని షెర్లిన్ ముంబై పోలీసులకు తెలిపింది.
ప్రస్తుతం రాజ్ కుంద్రా పోలీస్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంతో కుంద్రా సతీమణి, శిల్పా శెట్టి తీవ్ర వేదనలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు తన ఇంటికి రైడ్ కి వచ్చినప్పుడు ఆమె కుంద్రా తో గొడవ పడ్డట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com