అక్టోబర్‌లో షేర్
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన షేర్ అక్టోబర్ రెండో వారంలో విడుదల కానుంది. మల్లికార్జున్ దర్శకత్వం వహించారు. కొమర వెంకటేష్ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ప్రస్తుతం రీరికార్డింగ్ పనులను జరుపుకుంటోంది.
దర్శకుడు మాట్లాడుతూ ``కల్యాణ్‌రామ్‌గారి కెరీర్‌లో షేర్ సెన్సేషనల్ సినిమా అవుతుంది. నందమూరి అభిమానులు పండుగ చేసుకునేలా ఈ సినిమా ఉంటుంది. పటాస్ తర్వాత మళ్ళీ కల్యాణ్‌రామ్‌గారు ఈ సినిమాలో విజృంభించి నటించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది`` అని అన్నారు.
ఈ సినిమాకు కథ-మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: థమన్.ఎస్.ఎస్., లైన్ ప్రొడ్యూసర్స్: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్, సమర్పణ: సాయి నీహారిక, శరత్‌చంద్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com