అక్టోబ‌ర్‌లో షేర్‌

  • IndiaGlitz, [Saturday,September 12 2015]

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన షేర్ అక్టోబ‌ర్ రెండో వారంలో విడుద‌ల కానుంది. మ‌ల్లికార్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కొమ‌ర వెంక‌టేష్ నిర్మాత‌. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం రీరికార్డింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా ప్ర‌స్తుతం రీరికార్డింగ్ ప‌నుల‌ను జ‌రుపుకుంటోంది.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ''క‌ల్యాణ్‌రామ్‌గారి కెరీర్‌లో షేర్ సెన్సేష‌న‌ల్ సినిమా అవుతుంది. నంద‌మూరి అభిమానులు పండుగ చేసుకునేలా ఈ సినిమా ఉంటుంది. ప‌టాస్ త‌ర్వాత మ‌ళ్ళీ క‌ల్యాణ్‌రామ్‌గారు ఈ సినిమాలో విజృంభించి న‌టించారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రించేలా ఉంటుంది'' అని అన్నారు.

ఈ సినిమాకు క‌థ‌-మాట‌లు: డైమండ్ ర‌త్న‌బాబు, సంగీతం: థ‌మన్.ఎస్‌.ఎస్‌., లైన్ ప్రొడ్యూస‌ర్స్: దేవినేని బ్రహ్మానంద‌రావు, బండి ర‌త్న‌కుమార్‌, స‌మ‌ర్ప‌ణ‌: సాయి నీహారిక‌, శ‌ర‌త్‌చంద్‌.