నేను అభిమానించే దర్శకులలో శేఖర్ కమ్ముల సర్ ఒకరు: ధనుష్
Send us your feedback to audioarticles@vaarta.com
సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాన్ని ఎలా హద్దుకోవాలో శేఖర్ కమ్ములకు బాగా తెలుసు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు కమ్ముల చిత్రాలు పూర్తిగా భిన్నం. కమ్ముల చిత్రాల్లో పాత్రలు, సహజత్వం, భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
కమర్హియల్ అంశాలు లేనప్పటికీ ఆయన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తుంటాయి. ఆనందం, హ్యాపీడేస్, ఫిదా లాంటి చిత్రాలు అందుకు నిదర్శనం. ప్రస్తుతం శేఖర్ కమ్ముల చైతు, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది.
ఇదీ చదవండి: ప్రభాస్ 'రాధే శ్యామ్' లో ఊహకు అందని కోణం..
శేఖర్ కమ్ముల తదుపరి చిత్రం కూడా ఖరారైంది. విలక్షణ నటుడు హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల పాన్ ఇండియా చిత్రానికి ప్రకటన వచ్చేసింది. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసిన కాంబినేషన్ ఇది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ప్రకటన వచ్చిన తర్వాత ధనుష్ తొలిసారి స్పందించాడు.
'ఈ చిత్రం కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నేను అభిమానించే దర్శకులలో శేఖర్ కమ్ముల సర్ ఒకరు. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావు లాంటి నిర్మాతలతో చేతులు కలపడం సంతోషంగా ఉంది. ఈ త్రిభాషా చిత్రం కోసం ఆసక్తిగా ఉన్నా' అని ధనుష్ ట్వీట్ చేశాడు.
ధనుష్ ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అసురన్, కర్ణన్ లాంటి చిత్రాల్లో ధనుష్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com