'శేఖర్' నుంచి సెకండ్ సింగిల్ రెడీ.. పోస్టర్లో ఏం చెప్పారంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
రాజశేఖర్ హీరోగా నటిస్తున్న 91వ చిత్రం శేఖర్. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘‘జోసెఫ్’’కు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ‘‘శేఖర్’’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, తనికెళ్ళ భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌కే మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు పాత్రలో, ఆయన పెద్ద కూతురు శివాని నటించడం విశేషం. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గురువారం ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ కథ విషయానికి వస్తే.. రిటైర్మెంట్ తీసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్, ప్రశాంత జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే కొన్ని కీలకమైన కేసుల్లో పోలీస్ శాఖ ఆయన సహాయాన్ని తీసుకుంటూ ఉంటుంది.
ఈ క్రమంలో ఆయన దగ్గరికి ఒక కేసు వస్తుంది. ఆ కేసును ఆయన ఎలా పరిష్కరించాడనేదే ‘‘శేఖర్’’ కథ. ఈ సినిమాలో ఎలాంటి పాటలు ఉండవు .. హీరోయిన్ కనిపించేది కూడా తక్కువ సేపే. మరి ఒరిజినల్‌తో పోలిస్తే తెలుగుకి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేశారేమో చూడాలి. ఫిబ్రవరి 4న ‘‘శేఖర్’’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com