శేఖర్ మూవీ నాది.. సినిమా జోలికొస్తే పరువు నష్టం దావా వేస్తా: నిర్మాత సుధాకర్ రెడ్డి వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో తెరకెక్కిన శేఖర్ సినిమాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆ చిత్ర నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను శేఖర్ చిత్రానికి నిర్మాతనని పేర్కొన్నారు. జీవిత, రాజశేఖర్‌లకు పారితోషికాలు పూర్తిగా చెల్లించానని సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ సినిమా రాజశేఖర్, జీవితది అనుకుని ఎవరో కోర్టుకు వెళ్లారని ఆయన పేర్కొన్నారు. శేఖర్ సినిమాకు నష్టం కలిగించినా, ఏమైనా జరిగినా.. పరువు నష్టం దావా కేసు వేస్తానని సుధాకర్ హెచ్చరించారు. అంతేకాకుండా తాను నష్టపోయిన మొత్తాన్ని వాళ్ళ నుంచే రాబడతానని సుధాకర్ చెప్పారు. తనన సినిమాను ఎవరికీ అమ్మకూడదని ఏదో చెబుతున్నారని, అది చెల్లదని.. ఎందుకంటే... అసలు నిర్మాతను తానేనని ఆయన స్పష్టం చేశారు.
కాగా.. ‘శేఖర్’ మూవీ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రాజశేఖర్ మరోసారి తనమార్క్ నటనతో ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమా కోసం జీవితా రాజశేఖర్ తన వద్ద రూ. 65 లక్షలు అప్పుగా తీసుకున్నారని పరంధామ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. సినిమా విడుదల సందర్భంగా బాకీ తీరుస్తామని మాట ఇచ్చారని... కానీ తనకు రావాల్సిన మొత్తాన్ని జీవితా రాజశేఖర్ చెల్లించలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు ... జీవితా రాజశేఖర్ 48 గంటల్లోగా రూ. 65 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్ కింద కోర్టులో సమర్ఫించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఒకవేళ అలా డిపాజిట్ చేయలేనిపక్షంలో ''శేఖర్" సినిమాకు సంబందించిన సర్వ హక్కులను (నెగటివ్ రైట్) అటాచ్మెంట్ చేస్తూ అనగా థియేటర్స్ లో కానీ డిజిటల్, శాటిలైట్, ఓటీటీ, ఎటీటీ, యూట్యూబ్ వంటి ఫ్లాట్ ఫామ్స్‌లో సినిమాతోపాటు ట్రైలర్స్ ,పాటలతోసహ ఎలాంటి కంటెంట్ ప్రసారం చేయకుండా నిలుపుదల చేస్తూ, కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై బీరం సుధాకర్‌రెడ్డి స్పందించి క్లారిటీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments