శేఖ‌ర్ క‌మ్ముల 'గోదావ‌రి'కి 10 ఏళ్లు

  • IndiaGlitz, [Thursday,May 19 2016]

2004నాటి వానాకాలంకి 'కాఫీలాంటి సినిమా' అంటూ 'ఆనంద్' రూపంలో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు ఓ కొత్త ప్ర‌య‌త్నాన్ని తెచ్చి సైలెంట్ హిట్ కొట్టిన ఘ‌న‌త క్లాస్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌ది. ఆ త‌రువాత 2006 స‌మ్మ‌ర్‌లో 'ఈ వేస‌వి చాలా చ‌ల్ల‌గా ఉంటుంది' అంటూ 'గోదావ‌రి'ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చి మ‌రో విజ‌యాన్ని త‌న సొంతం చేసుకున్నారు. 1973 నాటి బాపు 'అందాల రాముడు'ని స్ఫూర్తిగా తీసుకుని క‌మ్ముల రూపొందించిన ఈ చిత్రం విన‌సొంపైన పాట‌లు, క‌నువిందైన దృశ్యాల‌తో గోదావ‌రిలో ప‌డ‌వ ప్ర‌యాణంలా చాలా ఆహ్లాదంగా ఉంటుంది.

సుమంత్‌, క‌మ‌లిని ముఖ‌ర్జీ న‌ట‌న‌, కె.ఎం.రాధాకృష్ణ‌న్ సంగీతం, విజ‌య్ సి.కుమార్ ఛాయాగ్ర‌హ‌ణం, శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం.. ఇలా అన్ని అంశాలు చ‌క్క‌గా కుదిరాయి ఈ సినిమాకి. 'నంది' పుర‌స్కారాల విష‌యంలో 'ద్వితీయ ఉత్త‌మ చిత్రం'గా నిల‌వ‌డ‌మే కాకుండా 'ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు'గా కె.ఎం.రాధాకృష్ణ‌న్‌, 'ఉత్త‌మ ద‌ర్శ‌కుడు'గా శేఖ‌ర్ క‌మ్ముల, 'ఉత్త‌మ ఛాయాగ్రాహ‌కుడు'గా విజ‌య్ సి.కుమార్‌, 'ఉత్త‌మ గాయ‌ని'గా సునీత (అందంగా లేనా) కి అవార్డులు అందించిన ఘ‌న‌త 'గోదావ‌రి'ది. 2006లో మే 19న విడుద‌లైన 'గోదావ‌రి' నేటితో 10 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

More News

మొన్న ఎన్టీఆర్ - నేడు ర‌వితేజ‌..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్  ఎ.పి ఆర్ 7 ఎ.ఎక్స్ 9999 కారులో ప్ర‌యాణిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ప్ర‌యాణిస్తున్న కారు అద్దాల‌కు లోప‌ల ఎవ‌రున్నారో క‌నిపించ‌కుండా ఉండేందుకు బ్లాక్ ఫిల్మ్ వేసి ఉంది.

టు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ రెడీ చేస్తున్న‌జ‌న‌తా టీమ్...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నభారీ  చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు.

జూన్ మొదటి వారంలో 'క‌బాలి' పాట‌లు విడుద‌ల‌ జులై 1న సినిమా విడుదల

సినిమా రంగంలో సాటిలేని స్టార్ ర‌జ‌నీకాంత్. ఆయ‌న సినిమా చేస్తున్నారంటే త‌మిళ‌నాటే కాదు ఇటు సౌత్ అంత‌టా,  అటు నార్త్ లోనూ, ఒక్క మాట‌లో చెప్పాలంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల్లో ఆయ‌న అభిమానులు, సినిమా ప్రేమికులు ఆ చిత్రం కోసం ఎదురుచూస్తుంటారు.

క‌ట్ట‌ప్ప గురించి బిగ్ న్యూస్ చెప్పిన కె.టి.ఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తార‌క రామారావు ఈరోజు బిగ్ న్యూస్ చెబుతాను అన్నారు. అయితే...కె.టి.ఆర్ చెప్పే బిగ్ న్యూస్ ఏమిటా అని ఆస‌క్తిగా ఎదురు చూసారు. ఇంత‌కీ కెటిఆర్ చెప్పాల‌నుకున్న బిగ్ న్యూస్ ఏమిటంటే.

నిజ‌మైన అభిమాని నాగ శౌర్య‌..

ఊహ‌లు గుస‌గ‌స‌లాడే..చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన యువ హీరో నాగ శౌర్య‌. ఆత‌ర్వాత దిక్కులు చూడ‌కు రామ‌య్య‌, ల‌క్ష్మి రావే మా ఇంటికి, జాదుగాడు, క‌ళ్యాణ వైభోగ‌మే...త‌దిత‌ర చిత్రాల‌తో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు.