ఆయ‌న చ‌ర్య‌కు బాధ‌ప‌డ్డానంటున్నహీరోయిన్‌...

  • IndiaGlitz, [Wednesday,November 15 2017]

ర‌జ‌నీకాంత్‌తో 'క‌బాలి' సినిమాలో..ఆయ‌న కూతురు పాత్ర‌లో న‌టించిన ధ‌న్సిన అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మ‌డు బిజీ బిజీగా మారింది. ఓ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడైన టి.రాజేంద్ర‌న్..న‌టి ధన్సిక త‌న పేరు ప్ర‌స్తావించ‌క‌పోవ‌డాన్ని తీవ్ర స్థాయిలో ద‌య్య బ‌ట్టాడు.

ఆమెను దుర్భాష‌లాడాడు. దాంతో ధ‌న్సిక వేదిక‌పైనే కంట‌త‌డి పెట్టుకోవ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. ఈ విష‌యంపై ధ‌న్సిక రీసెంట్‌గా స్పందించింది. టి.ఆర్ ఆధ్యాత్మిక వ్య‌క్తి కాద‌ని, ఆధ్యాత్మిక ఉన్న వ్య‌క్తికి అలా కోపం రాద‌ని అన్న ధ‌న్సిక‌..టి.ఆర్‌. త‌న‌ను దుర్భాష‌లాడ‌టంతో..ఆ ఘ‌ట‌న నుండి బ‌య‌ట‌కు రావ‌డానికి త‌న‌కు వారంపైనే ప‌ట్టింద‌ని తెలియ‌జేసింది.

తాను ఎంతో మానసిక క్షోభ‌కు గుర‌య్యాన‌ని, అనేక రంగాల్లో మ‌హిళ‌లు ఇలాంటి అవ‌మానాల‌ను ఎన్నింటినో ఎదుర్కొంటున్నార‌ని, అలా అని తాను మ‌గ‌వారిని త‌ప్పు ప‌ట్ట‌డం లేద‌ని కూడా ఈ సంద‌ర్భంగా ధ‌న్సిక తెలిపారు.

More News

'జై సింహా' ఆడియో డేట్ ఫిక్స‌య్యింది

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 102వ చిత్రం జై సింహా. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. న‌య‌న‌తార‌, న‌టాషా దోషి, హ‌రిప్రియ క‌థానాయిక‌లు.

2019 వేస‌వికి భార‌తీయుడు2?

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ద్విపాత్రాభిన‌యంలో ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ రూపొందించిన భార‌తీయుడు చిత్రం ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

మా శ్రమకు ఫలితమే ఈ నంది పురస్కారం..- దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్

భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం ఆదిత్య క్రియేటివ్ జీనియస్. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో 2014 సంవత్సరానికి ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా ఎంపికయ్యారు సుధాకర్ గౌడ్.

75 రోజుల షాలిని

ఆమోగ్ దేశపతి ,అర్చన ,శ్రేయవ్యాస్  హీరో హీరోయిన్లుగా  షెరాజ్ దర్శకత్వంలో లయన్ సాయి వెంకట్  సమర్పణలో స్వర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వి. సత్యనారాయణ నిర్మించిన  "షాలిని'' చిత్రం ఇటీవలే విడుదలై 75 రోజులు పూర్తీ చేసుకున్న సందర్బంగా హైద్రాబాద్ లో 75 రోజుల వేడుక నిర్వహించారు.

నచ్చినవారు నా సినిమా చూస్తే చాలు - సిద్ధార్థ్

సిద్ధార్థ్, వయూకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఎటాకి ఎంటర్టైన్మెంట్ బేనర్స్పై సిద్ధార్థ్, ఆండ్రియూ తారాగణంగా రూపొందిన హారర్ చిత్రం ’గృహం’. మిలింద్ రావ్ దర్శకుడు.