ఆమెకు పెద్దహీరోలే కావాలట....

  • IndiaGlitz, [Saturday,December 05 2015]

ఆ హీరోయిన్ కు పెద్ద హీరోలే కావాల‌ట‌. చిన్న హీరోలు అవ‌స‌రం లేద‌ట‌. ఎంత డ‌బ్బు ఇచ్చినా చిన్న హీరోల స‌ర‌స‌న న‌టించ‌నంటోంది. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? అందాల తార శ్రుతి హాస‌న్. ప్ర‌స్తుతం శ్రుతి హాస‌న్ నాగ చైత‌న్య స‌ర‌స‌న ప్రేమ‌మ్ రీమేక్ లో న‌టిస్తుంది.

చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతుంది. వైజాగ్ లో శ్రుతి హాస‌న్, చైత‌న్య‌ల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. తెలుగు, త‌మిళ్ లో అవ‌కాశాలు వ‌చ్చినా..శ్రుతి అంగీక‌రించ‌డం లేద‌ట‌. కార‌ణం ఏమిటంటే చిన్న హీరో అయితే వెంట‌నే నో చెప్పేస్తుంద‌ట‌. అలాగే పెద్ద హీరో అయితే స‌క్సెస్ లో ఉన్నాడా లేడా అనేది చూసి నిర్ణ‌యం తీసుకుంటుంద‌ట‌. ముఖ్యంగా హిందీ లో మ‌ళ్లీ న‌టించాల‌ని ప్ర‌యత్నిస్తుంద‌ట‌. శ్రుతి అన్ని భాష‌ల్లో న‌టించాల‌నుకుంటుంద‌ట‌. మ‌రి...అన్ని భాష‌ల్లో న‌టిస్తూ...ఇంకా బాగా పాపుల‌ర్ అవ్వాల‌నుకుంటున్న శ్రుతి కోరిక నెర‌వేరుతుంద‌ని ఆశిద్దాం.