మూడో షెడ్యూల్ లో 'షీ'
Send us your feedback to audioarticles@vaarta.com
కల్వకుంట్ల తేజేశ్వర్ రావ్(కన్నారావ్) నిర్మాతగా గతంలో '999' చిత్రానికి దర్శకత్వం వహించిన పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం 'షీ'. ఈజ్ వెయింటింగ్' అనేది ట్యాగ్‌లైన్. శ్వేతామీనన్; మహత్ రాఘవేంద్ర, చైతన్య ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ...
నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వర్ రావు మాట్లాడుతూ `ప్రస్తుతం సినిమా మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ ను ఫిభ్రవరి 15కు పూర్తి చేసేస్తాం. దీంతో టాకీ పార్ట్ పూర్తవుతుంది. సాంగ్స్ బ్యాలెన్స్ ఉంటాయి. ఓ సాంగ్ ను బెల్జియంలో ప్లాన్ చేస్తున్నాం. అలాగే సెట్ వేసి ఐటెంసాంగ్ ను చిత్రీకరిస్తాం. హీరో శివాజీ ఇందులో నెగిటివ్ రోల్ చేస్తున్నారు. సినిమా స్టార్టయినప్పటికీ, ఇప్పటికీ ఆర్టిస్టులు పెరిగారు. దీక్షాపంత్, రవిప్రకాష్, ఇలా అందరూ సినిమాలో యాడ్ అవుతున్నారు. తమిళ స్టార్ శింబు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాలో ఓ సాంగ్ పాడుతున్నారు. సినిమా బాగా వస్తుంది. ఎక్కడా ఖర్చుకు వెనకాడటం లేదు. శ్వేతామీనన్ అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
దర్శకుడు పర్స రమేష్ మహేంద్ర మాట్లాడుతూ `మన సంస్కృతి సంప్రదాయాలకు భయాన్ని జోడించి తెరకెక్కిస్తున్న స్వచ్చమైన ప్రేమకథ. నిర్మాతగారు అద్భుతమైన సపోర్ట్ ను అందిస్తున్నారు`` అన్నారు.
శివాజీ మాట్లాడుతూ ` రాజకీయాల్లో యాక్టివ్ గా మారిన తర్వాత ఇప్పటి రాజకీయాలకు నేను సరిపోనని అర్థమైంది. రెండున్నర సంవత్సరాలు రాజకీయాలకు దూరమయ్యాను. ఇప్పుడు మళ్ళీ సినిమాల వైపు దృష్టి మళ్ళించాను. 50 సినిమాల్లో హీరోగా నటించిన నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయబోతున్నాను. ఈ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్నాను. దీనికి కామెడి కూడా జోడిస్తున్నాను. దీనితో పాటు మరో రెండు చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను. మంచి టైటిల్. మంచి టీం. సినిమా బాగా వస్తుంది`` అన్నారు.
శ్వేతామీనన్ మాట్లాడుతూ `దర్శక నిర్మాతలు చెప్పిన కథ నచ్చడంతో చేయడానికి ఒప్పుకున్నాను. సినిమాను చాలా బాగా నిర్మిస్తున్నాను. ఈ సినిమాలో టైటిల్ రోల్ చేయడం ఆనందంగా ఉంది. సీనియర్ నటీనటులతో కలిసి చేయడం మంచి ఎక్స్ పీరియెన్స్ ` అన్నారు.
కవిత మాట్లాడుతూ ` సినిమా చాలా బాగా వస్తుంది. మంచి టీం వర్క్ చేస్తుంది. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్` అన్నారు.
దీక్షాపంత్ మాట్లాడుతూ `ఈ సినిమాలో పార్ట్ కావడం ఆనందంగా ఉంది. కవితగారి అమ్మాయి పాత్రలో కనపడతాను. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
శివాజీ, రవిప్రకాష్, దీక్షాపంత్, కవిత, రమాప్రభ, పోసాని, సూర్య, ధనరాజ్, చిత్రం శ్రీను తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: రామకృష్ణ, పాటలు: కాసర్ల శ్యామ్, రామ్ పైడి శెట్టి, సాయిసిరి, సంగీతం: బోలే, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: గట్టు విజయ్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బసంత్ రెడ్డి, నిర్మాత: కల్వకుంట్ల తేజేశ్వర్ రావు, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పర్స రమేష్ మహేంద్ర.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments