చంద్ర‌బాబు నాయుడి భార్య పాత్ర‌లో...

  • IndiaGlitz, [Tuesday,August 14 2018]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పాత్ర వెండితెర‌పై క‌న‌ప‌డ‌నుంది. అది ఏ సినిమాలో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' చిత్రంలో రానా ద‌గ్గుబాటి చంద్ర‌బాబు నాయుడిగా న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

బాల‌కృష్ణ ఎన్టీఆర్‌గా.. విద్యాబాల‌న్ బ‌స‌వ‌తార‌క‌మ్మ‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూతురు.. చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి దేవి పాత్ర‌లో మ‌ల‌యాళీ హీరోయిన్ మంజిమ మోహ‌న్ న‌టించ‌బోతున్నార‌ట‌.

ఈ చిత్రంలో ఇప్ప‌టికీ భారీ తారాగ‌ణం న‌టిస్తుంది. ఎ.ఎన్‌.ఆర్‌గా సుమంత్‌, శ్రీదేవిగా ర‌కుల్‌, స‌హా స‌చిన్ ఖేడేక‌ర్‌, జిన్‌సేన్ గుప్తా త‌దిత‌రులు న‌టిస్తున్నారు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.