క్రేజ్ ను క్యాష్ చేసుకుంటుంది..

  • IndiaGlitz, [Saturday,June 24 2017]

త‌మిళ హీరోయిన్ న‌య‌న‌తారకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో దాదాపు అంద‌రు అగ్ర‌హీరోలు న‌య‌న‌తార‌తో న‌టించిన‌వారే. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌, కె.ఎస్‌.రవికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య 102వ సినిమా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో బాల‌య్య ప‌క్క‌న హీరోయిన్‌గా న‌య‌న‌తార న‌టించ‌నుంద‌ట‌.

అల్రెడి బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార జంట‌గా శ్రీరామ‌రాజ్యం, సింహా సినిమాల్లో న‌టించారు. ఇప్పుడు మూడోసారి జ‌త క‌డుతున్నారు. కానీ ఈ సినిమాలో న‌టించ‌డానికి న‌య‌న‌తార భారీ రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేసింద‌ట‌. యూనిట్‌కు అంత మొత్తం ఇవ్వ‌డానికి సిద్ధ‌మైపోయింద‌ట‌. ఇంత‌కు న‌య‌న‌తార అడిగిన మొత్త‌మెంతో తెలుసా..అక్ష‌రాలా నాలుగు కోట్ల రూపాయ‌ల‌ని టాక్‌. తెలుగులో మినిమ‌మ్ బ‌డ్జెట్ ఉన్న హీరోకు ఇచ్చే రెమ్యున‌రేష‌న్‌ను న‌య‌న‌తార‌కు ఇస్తున్నార‌న్న‌మాట‌. ఏదేమైనా న‌య‌న‌తార త‌న క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటుంది మ‌రి..