తెలుగులో కూడా ఆమె న‌టిస్తుంది

  • IndiaGlitz, [Friday,June 24 2016]

స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో తెరకెక్కిన చిత్రం సాలా ఖ‌ద్దూస్‌. సుధా కొంగ‌ర ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మాధ‌వ‌న్‌, రితిక సింగ్‌లు న‌టించారు. మాధ‌వ‌న్ బాక్సింగ్ కోచ్‌గా న‌టిస్తే, రితిక అత‌ని శిష్యురాలిగా న‌టిస్తుంది. ఈ సినిమాను త‌మిళంలో ఇరుది సుట్రు అనే పేరుతో డ‌బ్ చేసి విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో మాధ‌వ‌న్‌, రితిక సింగ్‌ల న‌ట‌న‌కు మంచి పేరు రావడమే కాదు, స్పెషల్ కేటగిరీలో జాతీయ అవార్డును కూడా రితిక సొంతం చేసుకుంది.

ఈ చిత్రాన్ని తెలుగులో వెంక‌టేష్‌తో రీమేక్ చేయాల‌నుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. నిజానికి రితిక సింగ్ స్థానంలో మ‌రొక‌రిని తీసుకోవాల‌నుకున్నారు కూడా అయితే చివ‌ర‌కు డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర ప్ర‌సాద్ రితిక అయితేనే ఆ పాత్ర‌కు న్యాయం చేస్తుంద‌ని కాబ‌ట్టి తెలుగు రీమేక్‌లో కూడా ఈ రియ‌ల్ బాక్స‌ర్‌నే తీసుకోవాల‌నుకుంట‌న్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

More News

త్రిష 'నాయ‌కి' సెన్సార్ పూర్తి...

తెలుగు ప్రేక్ష‌కుల‌కి నాయ‌కి త్రిష ప‌న్నెండేళ్లుగా సుప‌రిచితం. కెరీర్ ప్రారంభంలో మంచి క్రేజ్‌ని మూట‌గ‌ట్టుకున్నా.. ఓ స్థాయి త‌రువాత ఆ క్రేజ్‌కు దూరంగా ఉండాల్సి వ‌చ్చింది. మ‌ళ్లీ మునుప‌టి హ‌వా కొన‌సాగించేందుకు త్రిష ప్ర‌య‌త్నిస్తోంది.

రాఘ‌వేంద్ర‌రావు గెడ్డం వెన‌కున్న క‌థ‌..

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు తాజాగా కింగ్ నాగార్జున‌తో ఓం న‌మో వేంక‌టేశాయ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ నిన్న తిరుప‌తిలో ఎనౌన్స్ చేసారు.

కొత్త త‌ర‌హా పాత్ర‌లో రామ్‌

నేను శైల‌జ స‌క్సెస్ త‌ర్వాత ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ఎక్క‌డా తొంద‌ర‌ప‌డ‌కుండా సినిమాలు చేసుకుంటున్నాడు. సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో 14 రీల్స్ బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న చిత్రంలో న‌టిస్తున్నాడు.

నాగార్జున చిత్రం లో వెంకటేశ్వర స్వామి ఇతనేనా ?

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందనున్న మరో భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ చిత్రం ఈ నెల 25న ప్రారంభం కానుంది.

మ‌న‌మంతా టీజ‌ర్ రిలీజ్ డేట్..

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్, గౌత‌మి, కేరింత ఫేం విశ్వంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం మ‌నమంతా. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు.