తెలుగులో కూడా ఆమె నటిస్తుంది
Send us your feedback to audioarticles@vaarta.com
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం సాలా ఖద్దూస్. సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవన్, రితిక సింగ్‌లు నటించారు. మాధవన్ బాక్సింగ్ కోచ్‌గా నటిస్తే, రితిక అతని శిష్యురాలిగా నటిస్తుంది. ఈ సినిమాను తమిళంలో ఇరుది సుట్రు అనే పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రంలో మాధవన్, రితిక సింగ్‌ల నటనకు మంచి పేరు రావడమే కాదు, స్పెషల్ కేటగిరీలో జాతీయ అవార్డును కూడా రితిక సొంతం చేసుకుంది.
ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్‌తో రీమేక్ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నిజానికి రితిక సింగ్ స్థానంలో మరొకరిని తీసుకోవాలనుకున్నారు కూడా అయితే చివరకు డైరెక్టర్ సుధా కొంగర ప్రసాద్ రితిక అయితేనే ఆ పాత్రకు న్యాయం చేస్తుందని కాబట్టి తెలుగు రీమేక్‌లో కూడా ఈ రియల్ బాక్సర్‌నే తీసుకోవాలనుకుంటన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com