అయ్యో.. రోజా కంటే ముందే ‘ఆమె’కు కీలక పదవి!?
- IndiaGlitz, [Tuesday,June 11 2019]
అవును.. మీరు వింటున్నది నిజమే ‘ఆమె’కు కీలక పదవి ఇచ్చి గౌరవించాలని ముఖ్యమంత్రి జగన్ ఫిక్స్ అయ్యారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల చివరికల్లా ఆమెకు నామినెటెడ్ పదవి కట్టబెడతారట. నగరి ఎమ్మెల్యే రోజాకు సెకండ్ టెర్మ్‌లో మంత్రి పదవి ఇచ్చి.. ఆమెకు మాత్రం వీలైనంత త్వరగానే ఏదో ఒక పదవి కట్టబెట్టాలని యోచిస్తున్నారట. ఇంతకీ ‘ఆమె’ ఎవరు..? రోజా కంటే ఫైర్ బ్రాండ్, మంచి వాక్ చాతుర్యం ఉన్న మహిళ ఇంకెవరున్నారబ్బా..? అని మీకు సందేహం కలుగుతోందా..? అయితే ఇక ఆలస్యమెందుకు ఈ స్పెషల్ స్టోరీ చదివేయండి మరి..
ఇంతకీ ‘ఆమె’ ఎవరు..? ఎందుకింత ప్రాధాన్యం!
పైన చెప్పినట్లుగా ‘ఆమె’ ఎవరో కాదండోయ్.. వాసిరెడ్డి పద్మ. ఈమె గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు.. ఈ పేరు, ఈమెకు అందరికీ సుపరిచితమే.. మరీ ముఖ్యంగా టీవీ చానెల్స్, వార్త పత్రికలు చదివే వారికి అస్సలు పరిచయం చేయనక్కర్లేదు. ఎక్కువగా టీవీ చానెల్స్ డిబెట్లకు.. ఎవరైనా వైసీపీ విమర్శలు గుప్పించినా.. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్‌ను తిట్టినా మరుక్షణమే ప్రెస్‌మీట్ పెట్టి దుమ్ముదులపడంలో పద్మ ఫస్ట్ వరుసలో ఉంటారు. వాస్తవానికి ఈమె ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ.. ఈమె కుటుంబానికి మాత్రం పొలిటికల్ బ్యాక్‌గ్రైండ్ గట్టిగానే ఉంది. అలా.. వైఎస్ ఫ్యామిలీకి వాసిరెడ్డి పద్మ దగ్గరయ్యారు. ఇవన్నీ అటుంచితే.. టీవీ చానెల్స్ డిబెట్లలో మహామహులు సైతం వాసిరెడ్డి దెబ్బకు తోక ముడిచేస్తారంతే. ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించడం.. వారిని ఇరుకున పెట్టే ప్రశ్నలు లేవనెత్తడంలో అస్సలు వైసీపీలో ఈమెను మించిన వారు ఎవరూ లేరు. అలా వైసీపీలో కీలక మహిళా నేతగా ఎదిగారు.
ఇంతకీ పద్మకు ఇచ్చే పదవేంటి!?
వాస్తవానికి రోజా కంటే ముందే ఈమెకు పదవి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రోజా- వాసిరెడ్డిని పోలికేలేదు. ఆమె ఎమ్మెల్యేగా.. ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచితే.. పద్మ మాత్రం ప్రత్యర్థులపై మాటల యుద్ధం చేసి వారిని ముప్పు తిప్పలు పెట్టడంలో సిద్ధహస్తురాలు. అలా వైసీపీ తరఫున గొంతుక వినిపించిన వాసిరెడ్డిని వైఎస్ జగన్ మనసులో పెట్టుకున్నారు. ఈమెకు ‘ఏపీ మహిళా కమిషన్ చైర్మన్’ పదవి ఇవ్వాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ప్రస్తుతం కేబినెట్ భేటీలు, అధికారులు బదిలీలు ఇవన్నీ జరుగుతుండటంతో నామినెటెడ్ పదవులు వ్యవహారం జగన్ పట్టించుకోలేదు.. ఈ నెల చివరికల్లా పదవుల పంపకాలు జరుగుతాయని తెలుస్తోంది. అయితే వాసిరెడ్డితో పాటు ఇంకా ఎవరెవర్ని కీలక పదవులు వరిస్తాయో వేచి చూడాల్సిందే మరి.