కమలా హ్యారిస్ టీమ్‌లో శతృఘ్నసిన్హా సోదరుని కుమార్తె!
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా.. బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా తాజాగా కమలా హ్యారిస్‌తోపాటు తన సోదరుని కుమార్తె ప్రీతీ సిన్హా ఉన్న ఒక ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో కమలా హ్యారిస్... ప్రీతి సిన్హా పక్కపక్కనే నిలుచుని ఉన్నారు. ఈ ఫొటోను షేర్ చేసిన శతృఘ్న సిన్హా.... ప్రీతి సిన్హా తన పెద్దన్నయ్య డాక్టర్ లఖన్ సిన్హా కుమార్తె అని, ఆమె కమలా హ్యారిస్‌కు అత్యంత సన్నిహితురాలని తెలిపారు. అంతే కాదు.. కమలా హ్యారిస్ టీంలో ప్రీతి సభ్యురాలుగా ఉన్నారని పేర్కొన్నారు.
భారతీయ మూలాలు కలిగిన కమలా హ్యారిస్ విజయం మనదేశంలోని వారికి కూడా ఆనందాన్ని పంచింది. కమలా హ్యారిస్ పూర్వీకులు తమిళనాడు లోని తిరువారూర్ జిల్లా మన్నార్‌కుడి సమీపంలోని తులసేంద్రపురం గ్రామానికి చెందినవారు.. దీంతో ఆ గ్రామంలోని ధర్మశాస్త ఆలయంలో విశిష్టపూజలు జరిగాయి. గ్రామంలో కమలా హ్యారిస్ చిత్ర పటాలతో ప్లకార్డులు, చిన్న చిన్న హోర్డింగ్‌లతో హోరెత్తించారు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంటింటా ముగ్గులు వెలిశాయి. బాణా సంచాల్ని పేల్చారు. స్వీట్లు పంచి పెట్టి ఆనందం వ్యక్తం చేశారు.
కమలా హ్యారిస్.... అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అంతేకాదు తొలి భారతీయ అమెరికన్ మహిళ కూడా కావడం విశేషం. అమెరికా చరిత్రలో రాజకీయ పదవుల్లో ఉన్నత స్థానాల్లో మహిళలు లేరు. ఇప్పుడు ఆ స్థానాన్ని కమలా హ్యారిస్ పూరించారు. అయితే మహిళలు ఎన్నికల్లో పోటీపడటం ఇదే మొదటిసారి కాదు. చాలా మంది మహిళలు అమెరికా ఎన్నికల బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
promoting & encouraging our own Kamala & her people for this outstanding mega win. Our daughter, Preeta too deserves Kudos! Well done! God Bless! pic.twitter.com/MY4FSLl3Rv
— Shatrughan Sinha (@ShatruganSinha) November 8, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com