'శతమానం భవతి' పాటల పల్లకి వచ్చేసింది....

  • IndiaGlitz, [Monday,December 19 2016]

'శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా సతీష్‌ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'శతమానంభవతి'. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో జరిగింది. ముఖ ఫైనాన్సియ‌ర్ సత్య రంగయ్య, ఆయ‌న కుమారుడు ప్ర‌సాద్‌, మనవడు రంగ యశ్వంత్ బిగ్ సీడీసీడీని విడుద‌ల చేశారు.

ఆడియో సీడీల‌ను సత్య రంగ‌య్య విడుద‌ల చేసి తొలి సీడీని మిక్కి జె.మేయ‌ర్‌కు అందించారు. మూడు త‌రాల‌కు సంబంధించిన ప్రేమానురాగాలను తెలియ‌జేసే 'శ‌త‌మానం భ‌వ‌తి'చిత్రంలో ప్ర‌కాష్‌రాజ్‌, జ‌య‌సుధ మొద‌టి జ‌న‌రేష‌న్ జంట‌గా న‌టిస్తున్నారు. విదేశాల‌కు వెళ్లి మ‌నం ఎమోష‌న్స్‌ను మ‌ర‌చిపోతున్నాం, ఈ సినిమా చూస్తే ఆ అనుభూతుల‌ను మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయ‌ని అంటున్నారు నిర్మాత దిల్‌రాజు. దిల్‌రాజు ఆయ‌న కుటుంబ స‌భ్యుల మ‌ధ్య‌, ప్రేక్ష‌కులు యూనిట్ స‌భ్యుల మ‌ధ్య దిల్‌రాజు పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. నిర్మాత‌గా నేను స‌క్సెస్ అయ్యానంటే నా కుటుంబ స‌భ్యుల‌తో పాటు చాలా మంది త‌న‌కు అండ‌గా నిల‌బ‌డ్డార‌ని దిల్‌రాజు తెలిపారు.

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ..మ‌నలో, మ‌న ఫ్యామిలీలో ఎవ‌రైనా ఒక‌రు ప‌ల్లెటూరు నుండి వ‌చ్చే ఉంటారు. మ‌నం ఈ బిజీ లైఫ్‌లో ప‌డి అనుబంధాల‌ను మ‌ర‌చిపోతున్నాం. ఆ ఎమోష‌న్స్‌ను మ‌న‌కు గుర్తుకు తెచ్చే సినిమా ఇది. ఈ సినిమా మూడు జ‌న‌రేష‌న్స్‌కు సంబంధించిన‌ద‌ని స‌తీష్ చెప్ప‌గానే ఎగ్జ‌యిట్ అయ్యాను. ముందు ఈ క‌థ‌ను సాయిధ‌ర‌మ్ తేజ్‌, రాజ్ త‌రుణ్ హీరోలుగా చాలా చాలా అనుకున్నాం. సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయాలి. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతుంది. అందుక‌ని ఓ సారి నేను యు.ఎస్ వెళ్లిన‌ప్పుడు శ‌ర్వానంద్ యు.ఎస్‌లో ఉన్నాడ‌ని తెలుసుకుని త‌నైతే ఈ క‌థ‌న‌కు స‌రిపోతాడ‌నిపించి ఫోన్‌లో ప‌దిహేను నిమిషాల క‌థ‌ను వినిపించాను. మా మ‌ద్య అనుబంధంతో శ‌ర్వానంద్ పూర్తి క‌థ‌ను విన‌డానికి ఒప్పుకున్నాడు. అయితే క‌థ విన్న త‌ర్వాత సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. మేమేదో కొత్త సినిమా చేశామ‌ని చెప్ప‌లేదు. ప్ర‌తి సీన్ బ్యూటీఫుల్‌గా ఉంటుంది. మిక్కి మంచి మ్యూజిక్‌ను అందించారు. సంక్రాంతికి ఓ మంచి సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నామ‌ని దిల్‌రాజు అన్నారు.

రామానాయుడు నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది నిర్మాత‌ల‌తో వ‌ర్క్ చేశాను. ఈ జ‌న‌రేషన్‌లో సినిమా అంటే చాలా ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తుల్లో దిల్‌రాజుగారు ఒక‌రు. ఆయ‌న బ్యాన‌ర్‌లో నేను చేసిన సినిమాల‌న్నీ నాకు మంచి పేరు తెచ్చాయి. వాటి స‌ర‌స‌న శ‌త‌మానం భ‌వ‌తి సినిమా కూడా నిలిచిపోతుంది. మిక్కి బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు. సంక్రాంతి సంద‌ర్భంగా రానున్న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా నచ్చ‌తుంద‌ని స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ తెలిపారు. తాత అయిన త‌ర్వాత దిల్‌రాజు జ‌రుపుకుంటున్న తొలి పుట్టిన‌రోజు ఇది. ఒక కుటుంబ విలువ‌లు ఉన్న సినిమాల‌ను ఇండ‌స్ట్రీలోకి తీసుకొచ్చిన నిర్మాత దిల్‌రాజుగారికి శ‌త‌మానం భ‌వ‌తి ఓ స్పెష‌ల్ మూవీ. మిక్కి మ్యూజిక్ అందించిన ఈ సినిమా పాట‌లు ఇక‌పై అన్నీ పెళ్ళి వేడుక‌ల్లో విన‌ప‌డ‌తాయి. శ‌ర్వా డిఫ‌రెంట్ క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. త‌న‌కు శ‌త‌మానం భ‌వ‌తి మ‌రో పెద్ద స‌క్సెస్ కావాల‌ని వంశీ పైడిప‌ల్లి తెలియ‌జేశారు. సినిమ పెద్ద హిట్ కావాల‌ని శేఖ‌ర్ క‌మ్ముల యూనిట్‌ను అభినందించారు.

శ‌త‌మానం భ‌వ‌తి సినిమాను 49రోజుల్లోనే పూర్తి చేశాం. ఈ క‌థ‌ను న‌మ్మి, నాపై న‌మ్మ‌కంతో నాతో పాటు ఏడాదిన్న‌ర ట్రావెల్ చేసి ఈ సినిమాను నిర్మించిన దిల్‌రాజుగారికే ఈ క్రెడిట్ ద‌క్కుతుంది. మాతృదేవోభ‌వ‌, పితృదేవోభ‌వ‌, ఆచార్య‌దేవోభ‌వ ఈ ప‌దాల‌ను మ‌నం చిన్న‌ప్పుడు నేర్చుకునే ఉంటాం. అయితే వీటి అర్థాల‌ను పూర్తిగా తెలుసుకునేట‌ప్ప‌టికీ మ‌నం త‌ల్లిదండ్రుల‌కు దూరంగా ఉంటాం. ఇలాంటి ఓ ఆలోచ‌న నుండి పుట్టిన క‌థే మా 'శ‌త‌మానంభ‌వ‌తి' అని ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న స‌హ‌కారం అందించిన యూనిట్‌కు ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేశారు.

దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో 'శ‌త‌మానం భ‌వ‌తి' సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. సెన్సిటివ్ మూవీ. అమెరికాలోని ఉండే తెలుగువారితో పాటు తాత తండ్రులు, మ‌న‌వ‌ళ్లంద‌రూ క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది. మంచి సాహిత్యం కుదిరింది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్ అని మ్యూజిక్ డైరెక్ట‌ర్ మిక్కి జె.మేయ‌ర్ చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఇంద్ర‌జ‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రాజ్ త‌రుణ్‌, నిఖిల్‌, కాస్ట్యూమ్ కృష్ణ స‌హా పలువ‌రు అతిథులు ఆడియో వేడుక‌లో పాల్గొన్నారు. సినిమాలో వ‌ర్క్ చేసిన సాంకేతిక నిపుణుల‌ను నిర్మాత దిల్‌రాజు స‌త్క‌రించారు.

శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్ , ప్రకాష్ రాజ్ , జయసుధ , ఇంద్రజ , శివాజీ రాజా , ప్రవీణ్ , సిజ్జు , శ్రీ రాం , మధురిమ , నీల్యా , ప్రమోదిని, మహేష్ , భద్రం , హిమజ , ప్రభు తదితరులు న‌టించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం – సమీర్ రెడ్డి, సంగీతం - మిక్కీ జె. మేయర్, సాహిత్యం - శ్రీ మ‌ణి, రామజోగయ్య శాస్త్రి, కూర్పు - మధు, కళా దర్శకుడు – రమణ వంక, కథ - కథనం –మాటలు-దర్శకత్వం - వేగేశ్న సతీష్.

More News

చరణ్ కోసం సుక్కు కొత్త లుక్....

మెగాపవర్ స్టార్ రాంచరణ్ రీసెంట్ గా ధృవ చిత్రంతో మంచి సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.

అమ్మ పాత్రలో చేయడమే డ్రీమ్ రోల్ అంటుంది...

తమిళ ప్రజల అమ్మగా,తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలితకు ఉన్న క్రేజే వేరు.

పవన్ పై కేసునమోదు...

ప్రజల దేశభక్తిని నిరూపించుకునేందుకు సినిమా హాళ్లు పరీక్షా కేంద్రాలైయ్యాయంటూ రీసెంట్ గా తన ట్విట్టర్ అకౌంట్ లో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

నాగ్ ఎన్ కన్వెన్షన్ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి..!

టాలీవుడ్ హీరో నాగార్జున చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను కట్టారని తెలిసినప్పటికీ ప్రభుత్వం ఏమీ చేయకపోవడం ఏమిటి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

'పిట్టగోడ' వంటి డిఫరెంట్ ఎంటర్ టైనర్ కు మ్యూజిక్ చేయడం హ్యాపీ - ప్రాణం కమలాకర్

విశ్వదేవ్ రాచకొండ,పునర్నవి హీరోహీరోయిన్లుగా స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్,సన్ షైన్ సినిమాస్ పతాకాలపై