జనవరి 8న శాతవాహన పతాకోత్సవం..!
- IndiaGlitz, [Wednesday,January 04 2017]
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చారిత్రాత్మక చిత్రాన్ని జాగర్లమూడి క్రిష్ తెరకెక్కించారు. వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 8వ తారీఖు 5.40 నిమిషాలకు శాతవాహన పతాకోత్సవం నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమంలో అభిమానులు, ప్రేక్షకులు పాల్గొనాలని చిత్ర నిర్మాతలు పిలుపునిచ్చారు.
గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ కు యుట్యూబ్ లో అనూహ్యమైన స్పందన లభించడంతో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం. ఇక గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియోను తిరుపతిలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక పతాకోత్సవంను ఈనెల 8న 100 థియేటర్స్ లో నిర్వహించనున్నారు.స్పెషల్ గా డిజైన్ చేసిన శాతవాహన జెండానును 100 థియేటర్స్ లో ఆవిష్కరించనున్నారు. మనం జరుపుకుంటున్న ఉగాది అనే పండుగను ప్రారంభించింది శాతవాహనుడే. మహారాష్ట్రలో మన ఉగాదిని గుడిపడ్వ పేరుతో జరుపుకుంటారు. ఇండియాలో వేరే వేరే పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్, నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, సాయి కొర్రపాటి వైజాగ్ జ్యోతి థియేటర్ లో సాయంత్రం 5.40 నిమిషాలకు శాతవాహన జెండాను ఆవిష్కరించనున్నారు. మిగిలిన 99 థియేటర్స్ లో నందమూరి బాలకృష్ణ అభిమానులు జెండాను ఆవిష్కరించనున్నారు. పతాకోత్సవం నిర్వహించే 100 థియేటర్స్ లిస్ట్ త్వరలో ఎనౌన్స్ చేయనున్నారు.