శతమానం భవతి ట్రైలర్ రిలీజ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించిన చిత్రం శతమానం భవతి. ఈ చిత్రంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించారు. మూడుతరాల అనుబంధం కథాంశంగా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే ఒక అందమైన కుటుంబ కథా చిత్రంగా ఈ చిత్రం రూపొందింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన శతమానంభవతి పాటలకు విశేష స్పందన లభిస్తుంది.
ఇక శతమానం భవతి ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే...ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా అవుతుంది. సకుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి సినిమాగా శతమానం భవతి నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈనెల 14న రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments