'శతమానం భవతి' రిలీజ్ డేట్ ఫిక్స్....

  • IndiaGlitz, [Sunday,January 01 2017]

దిల్ రాజు నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి". అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక గా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రీసెంట్‌గా సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది.

శతమానం భవతి తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రంగా వ‌స్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా సినిమాను జ‌న‌వ‌రి 14న గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి దిల్‌రాజు రంగం రెడీ చేస్తున్నారు. ఇది శర్వానంద్ 25 వ చిత్రం కావటం విశేషం. మిక్కీ అందించిన సంగీతం ఇప్పటికే పెద్ద హిట్ అయ్యింది. బొమ్మరిల్లు సినిమా మా సంస్థ కి ఎంత పేరు తెచ్చిందో , ఈ చిత్రం కూడా అంతే పేరు ని తెస్తుంది అన్న నమ్మకంతో దిల్‌రాజు ఉన్నారు.