'శ‌త‌మానం భ‌వ‌తి' ఓవ‌ర్‌సీస్ హ‌క్కులు

  • IndiaGlitz, [Wednesday,October 12 2016]

శర్వానంద్‌ హీరోగా సతీష్ వేగేశ్న‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ ప్రొడక్షన్‌ నెం.24 కొత్త చిత్రం 'శతమానంభవతి'. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తామ‌ని విడుద‌ల‌కు ముందే దిల్‌రాజు ప్ర‌క‌టించ‌డం విశేషం. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుటుంది.

ప్రేమ‌మ్ ఫేం అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, జ‌య‌సుధ కీల‌క‌పాత్ర‌ల్లోన‌టిస్తున్నారు. మూడు త‌రాలకు చెందిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా బిజినెస్‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డింది. సినిమా ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ను బ్లూ స్కై సినిమాస్ సంస్థ చేజిక్కించుకోవ‌డం విశేషం.